బంగారం ధరలో మార్పు లేదు
తగ్గిన వెండి ధర
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,600.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,750.
1కిలో వెండి 75, 700
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు తటస్థంగా ఉన్నాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ తో పాటు, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 45 వేల 600 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 49 వేల 750 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి 700 రూపాయలు తగ్గింది. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 75 వేల 700 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1100 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1190 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ట్రేడింగ్ పై కరోనా ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. రేపు బంగారం, వెండు ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.