ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది..ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది..ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి..ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి అంటూ పెళ్లి కుమార్తె పస్ట్ నైట్ రోజు పాడుకుంటోంది. ఎంత సేపటికీ వరుడు రాలేదు. మొత్తం వెతికినా లాభం లేదు. చివరికీ ఉదయం ఇంటికి వచ్చి అతగాడు చెప్పిన రీజన్ కు అందరూ షాక్ తిన్నారు.
పెళ్లి ఇరు కుటుంబాలను ఏకం చేస్తుంది. అంతేకాదూ రెండు హృదయాలను కలుపుతుంది. ఇద్దరినీ అధికారికంగా ఒక్కటీ చేసే ఏకైక తంతు పెళ్లి. ప్రతి పెళ్లైన జంట కొంగొత్త ఆశలతో, కోటి కోరికలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. అయితే పెళ్లి తర్వాత జరిగే అసలు కార్యక్రమం తొలి రేయి. కొత్తగా పెళ్లయిన జంటకు తొలి రాత్రి మధురమైనది. పెళ్లి పనులతో మొదలైన నాటి నుండి అలుముకున్న బంధం ఆ రాత్రికి ఒక్కటి కాబోతుంది. ఆ రోజు కోసం తమ యవ్వన ప్రాయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఆ యువకుడికి ఆ రాత్రి కాళ రాత్రి అయింది. కొత్త పెళ్లి కుమార్తె జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చింది.
అసలు విషయం తెలిస్తే మీరు కూడా నవ్వుతారు. తొలి రేయిని వీడియోలో పొందుపరచాలన్న ఆత్రుతతో ఓ జంట నవ్వులు పాలు కాగా, ఓ వరుడు ఫస్ట్ నైట్ కు బయ పడి ఇంటి నుండే పారిపోయిన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడి ఓ స్థానిక వార్తా పత్రికలో దీని గురించి రాయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ కథనం ప్రకారం నూతనంగా పెళ్లైన ఓ జంటకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. శోభనం గదిని అందంగా అలంకరించారు. పూలు , పళ్లు ఏర్పాటు చేశారు. పెళ్లి కుమార్తె కూడా ఎదురు చూస్తూ కూర్చుంది. ఎంతకూ భర్త రాలేదు. దీంతో కుటంబ సభ్యులు రాత్రంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు.
అటు పెళ్లి కుమార్తె, వారి తల్లిదండ్రుల కుటుంబాల్లో కూడా ఆందోళన మొదలైంది. వరుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసు కంప్లయింట్ ఇద్దామని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చాడు. అతడ్ని నిలదీయగా తాను పక్కింట్లోనే ఉన్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎందుకు ఇలా చేశామని అడిగితే.. తనకు సిగ్గేసిందని చెప్పాడు. శోభనం అంటే సిగ్గేసి ఆ రాత్రి పక్కింట్లో దాగునాన్నని, ఇంటికి రావాలని అనుకోలేదనంటూ చెప్పడట. ఈ మాట అనగానే ఆగ్రహంతో ఉన్న బంధు వర్గం అవాక్కవ్వడంతో పాటు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. శోభనానికి భయపడి వరుడు పారిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.