పైవంతెనల నిర్మాణంలో ఒక్కోసారి నిర్మాణలోపమో, నాణ్యతా లోపమో కానీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి పది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నగరం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ట్రాఫిక్ జామ్. ప్రజలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉన్నాకూడా నిత్యం ఉద్యోగాలకు వెళ్లే సమయంలో టైంకు చేరుకోలేక సతమతమవుతుంటారు. ఈక్రమంలో నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌లు నిర్మిస్తున్నారు. అయితే ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా రోజురోజుకు రద్దీ పెరుగుతూనే ఉంది. ఈ పైవంతెనల నిర్మాణంలో ఒక్కోసారి నిర్మాణలోపమో, నాణ్యతా లోపమో కానీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి పది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. సాగర్ రింగ్ రోడ్డులో బైరమలగూడ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్నక్రమంలో పిల్లర్ టూ పిల్లర్ స్లాబ్ చేస్తున్న సమయంలో ఘోర ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి మిషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఫ్లైఓవర్ కూలిన ప్రమాదంపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయిస్తానని అన్నారు. దీనికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.