ఎండాాకాలంలో మండిపోయే ఎండల నుండి స్వాంతన కల్పిస్తాయి వర్షాలు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు వర్షాలకు పులకరించిన వారి ఉండరు. అయితే ఈ వర్షాల సమయంలో మనం కొన్ని అద్భుతాలు చూస్తుంటాం. మంచుముక్కలతో కూడిన వడగళ్లు వాన కురవడం, చేపలు పడటం చూస్తాం. అయితే ఎడారి ప్రాంతంలో వర్షాలు పడవు. కానీ పడటమే కాకుండా ఓ అద్బుతం ఆవిష్కృతం కూడా అయింది.
వర్షాకాలం అంటే ఎవరికీ ఇష్టముండదో చెప్పండి. ఎండాకాలంతో సూర్య భగవానుడి భగభగలకు అంతే స్వాంతన కల్పిస్తాయి వర్షాలు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు వర్షాలకు పులకరించిన వారి ఉండరు. అయితే ఈ వర్షాల సమయంలో మనం కొన్ని అద్భుతాలు చూస్తుంటాం. మంచుముక్కలతో కూడిన వడగళ్లు వాన కురవడం, చేపలు, కప్పలు పడటం చూస్తుంటాం. విన్నాం కూడా. అసలు వర్షాల ముఖం ఎరగని ప్రాంతంలో వానలు కురవడమే ఆశ్చర్యమైతే.. ఈ ఎడారిగా ముద్ర పడిన ఆ ప్రాంతంలో మరో అద్భుతం ఆవిష్కృతమవ్వడం మరో వింత. ఇంతకూ ఆ ప్రాంతం ఏ దేశంలో ఉందంటే..?
ఆ దేశమే ఆస్ట్రేలియా. వర్షపు చుక్కే అరుదైన ఆ దేశంలోని ఓ ప్రాంతంలో ఆకాశం నుంచి ఏకంగా చేపల వర్షం కురిసింది. అది చూసిన జనాలు సైతం షాక్ అయ్యారు. ఇదంతా దేవుడు మహత్యమేనని భావిస్తున్నారు. చేపల వర్షంతో రోడ్డు, నగరాలు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని కేథరీన్‌కు నైరుతి దిశలో దాదాపు 560 కిలోమీటర్ల దూరంలో టనామీ ఎడారి ఉంది. ఆ ఎడారి ఉత్తర అంచులో ఉన్న లాజమాను అనే పట్టణంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. ఆ వర్షంతోపాటే.. చేపలు భారీ సంఖ్యలో పడ్డాయి. అది చూసి లాజామ పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలుత టోర్నోడో రూపంలో గాలి, దూమారం వచ్చిందని ఆ తర్వాత..వర్షం కురవగా.. దాంతో పాటు చేపలు పడుతూ వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.రోడ్లపై, నివాసాలపై ఈ చేపలు పడుతుండటంతో భారీగా శబ్దాలు వచ్చాయి. తీరా వచ్చి చూస్తే ఎటు చూసినా చేపలే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
చాలా సేపటి వరకు చేపల వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఆ చేపలన్నీ కూడా బతికి ఉన్నాయట. కొంత మంది ఈ చేపలను ఇంటికి కూడా తెచ్చుకున్నారు. చిన్న పిల్లలైతే వీటిని సేకరించి కూజాల్లో,నీళ్ల తోటల్లో వేశారట. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని లాజమాను పట్టణ ప్రజలు చెబుతున్నారు. 1974, 2004, 2014 లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కొంత మంది ఇది ఎలా సాధ్యం అని అనుమానిస్తున్నారు. అయితే, వాతావరణ నిపుణులు మాత్రం మరొక విధంగా చెబుతున్నారు. భారీ సుడిగుండాలు, టోర్నడోలు నీటితో పాటు చేపలను తీసుకెళ్లి వందల కిలోమీటర్ల దూరంలో పడేస్తాయని చెబుతున్నారు. ఈ కారణంగా చేపలు ఆకాశం నుంచి పడతాయని వివరణ ఇస్తున్నారు. ఇదంతా దేవుడి ఆశ్వీరాదమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మీరెప్పుడైనా వర్షం పడినప్పుడు వడగళ్ల వాన కానీ, ఇటువంటి అద్భుత దృశ్యాలు చూసినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In a freak weather event, alive fish started falling from the sky at the Lajamanu community on the edge of the #Australian desert.
Tornados can suck up fish from lakes and drop them 100s of km away, and if the fish are lucky they won’t freeze, and they’ll survive the fall. pic.twitter.com/G1LXoNz1qI— last_goose (@ElaBoubou) February 21, 2023