ఇటీవల కొన్ని సెలబ్రిటీ జంటలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు కోలీవుడ్ బుల్లి తెర జంట విష్ణుకాంత్- సంయుక్త . అయితే వీరి వివాహం 2 నెలలకే తెగిపోయింది. గత ఏడాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన జంట.. చెల్లమ్మ సీరియల్ నటుడు ఆర్నవ్. చెవ్వంతి సీరియల్ నటి దివ్య శ్రీధర్. ఇప్పుడు దివ్య. ఆర్నవ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.
ఇటీవల కొన్ని సినిమా జంటలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు కోలీవుడ్ బుల్లి తెర జంట విష్ణుకాంత్- సంయుక్త . అయితే వీరి వివాహ బంధం 2 నెలలకే తెగిపోయింది. అప్పటి నుండి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తెగ ట్రెండింగ్ అవుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో జంట వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన జంట.. చెల్లమ్మ సీరియల్ నటుడు ఆర్నవ్. చెవ్వంతి సీరియల్ నటి దివ్య శ్రీధర్. వీళ్లిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అనూహ్యంగా దివ్య గర్భిణీగా ఉన్న సమయంలో వీరిద్దరూ విడిపోయారు.
అయితే దివ్య గతంలో వివాహం జరిగి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తన దగ్గర దాచి తనను పెళ్లి చేసుకుంది అంటూ ఆర్నవ్ ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఆర్నవ్ గురించి సంచలన విషయాలు బయటపడింది. చెల్లమ్మ సీరియల్ సహనటితో ఆర్నవ్ ప్రేమలో పడ్డాడని, దాని గురించి అడిగితే గర్భవతి అని కూడా చూడకుండా.. తన కడుపుపై కొడితే.. రక్తం కారినట్లు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని అరెస్టు చేయగా.. బెయిల్ పై విడుదలయ్యాడుు. అయితే ఆర్నవ్ కూడా దివ్యపై పలు ఆరోపణలు చేస్తూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కాగా, ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి ఆర్నవ్ పై ఆరోపణలు గుప్పించింది. శ్రీలంకకు చెందిన ఓ యువతితో జిమ్ లో పరిచయం పెంచుకుని, ప్రేమ అని చెప్పి, గర్భవతి అయ్యాక మొహం చాటేశాడని తెలిపింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టింది.
ఆర్నవ్ ఎంతోమంది అమ్మాయిలను కూడా మోసం చేశాడని, ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. బాధితులంతా తనకు ఇన్ స్టా వేదిక ద్వారా రహస్యాలు వెల్లడిస్తున్నారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టింది. ఓ ఆడియోలో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. ఆర్నవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది.