సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మైథాలజీ చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇందులో భాగంగా సినిమా 3డి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గుణశేఖర్, దిల్ రాజు, నీలిమ గుణ, సాయిమాధవ్ బుర్రా, తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు టాప్ హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటారు నటి సమంత. ఏ మాయ చేశావేతో అందర్ని కట్టిపడేసిన ఈ చిల్ బులీ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ముందు గ్లామరస్ పాత్రలు చేశారు. ఆ తర్వాత కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒప్పుకోవడం మొదలు పెట్టారు. ఇప్పడు పూర్తిగా ఫీమేల్ ఓరియంట్ సినిమాల వైపుగా మొగ్గుచూపుతున్నారు. ఓ బేబీ, యూటర్న్, యశోద, ఇప్పుడు వస్తున్న శాకుంతం ఆ కోవకు చెందినవే. అయితే ఎప్పుడూ ట్రై చేయని జోనర్‌లో ఆమె తొలిసారిగా నటిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము కథ ఆధారంగా ఈ సినిమాను విజువల్ వండర్స్ చేసే గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే నెల 14న థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్ పాల్గొంటోంది.
ఈ సినిమా 3డి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణ, సాయిమాధవ్ బుర్రా, తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. శాకుంతలం పాత్ర కోసం సమంత పుట్టారా అని సినిమా చూసినప్పుడు అంటారని పేర్కొన్నారు. ఈ సినిమాకు దిల్ రాజు సమర్పుకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఎవరితో సినిమాలు చేసినా.. కష్టపడతారన్నారు. ఎవ్వరూ చేయనంత ఖరీదైన చిత్రమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. ఇలాంటి సినిమాకు ఏ నిర్మాత ఇంత పెట్టుబడి పెట్టలేదని అన్నారు. నార్త్‌లో కూడా ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తితో ఉన్నారని, చాలా మంది తెలియనివాళ్లు సమంత దిల్ రాజు కూతురా అనుకుంటున్నారు. ఎందుకంటే దిల్ రాజు అంత ఇన్వెస్ట్ చేసేశారని, ఎందుకంత ఇన్వెస్ట్ చేశారనే డౌట్ వాళ్లకు వచ్చిందని, అన్ని కోట్లు పెట్టి ఓ మైథాలజీ సినిమాను తీస్తారా అని భావిస్తున్నారన్నారు.
ఈ సినిమా హిమాలయ బ్యాక్ డ్రాప్ లో తీసిందని, తొలుత 2డిలో తీసిన ఈ సినిమాను ఆ తరవాత 3డిలోకి మార్చాలని అనుకుని, దీనికి ఆరు నెలల సమయం తీసుకున్నామని, ఈ సమయంలో ఖర్చు విపరీతంగా పెరిగిందని దిల్ రాజు చెప్పారు. తన కుమార్తె, మరో నిర్మాత నీలిమా గుణ గురించి గుణశేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా సినిమాలు తీయాలని, తను చాలా విషయాల్లో వార్స్ చేసిందన్నారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌తో రామాయణం అనే మైథాలజీ తీశారు. మళ్లీ ఇంతకాలానికి శాకుంతలం తీశారు. అప్పటి ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఈ సినిమాకు ఎలా ఉపయోగపడింది’ అని ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను పరిచయం చేస్తూ ఆయన రాముడిగా రామాయణం చేసి 25 ఏళ్లు అయ్యింది. అప్పుడు మిచెల్ కేమెరాతో చాలా వరకు ఇన్‌కెమెరా ఎఫెక్ట్‌లు తీశాం. మిచెల్ కేమెరా వాడిన ఆఖరి సినిమా కూడా అప్పట్లో రామాయణమే‘ అని తెలిపారు
అప్పటికి ఇండియాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ పెద్దగా లేదని, బాంబేలో ఎవరో కొంత సీజీ మీద ఆధారపడ్డామన్నారు. టెక్నికల్‌గా ఈ 25 సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందని, చాలా మందికి తెలియన విషయం ఏంటంటే ‘ఒక్కడు’ సినిమాలో చాలా సీజీ వర్క్ ఉందన్నారు. అది కేవలం విజువల్ ఎన్‌హేన్స్‌మెంట్ వాడామని,. అంత పెద్ద చార్మినార్‌ను నేల మీద వేశామన్నారు. కింద వీధులన్నీ సీజీలో క్రియేట్ చేశామని, మహేష్ బాబు లాంటివాడి సపోర్ట్ ఉండటంతో అది తీయగలిగామన్నారు. అలాగే అల్లు అర్జున్ తనయ అల్లు అర్హను ఆకాశానికి ఎత్తారు. ఆమెకు ఒక్క ముక్క ఇంగ్లీషు రాదని అంటూనే దీనికి కారణమైన తండ్రి, నటుడు అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన ఊరికే ఐకాన్ స్టార్ ఐపోలేదంటూ పేర్కొన్నారు.