ప్రజలకు రక్షణ కల్పించాల్సిన న్యాయ స్థానాల్లో కల్లోలిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న భార్యపై భర్త యాసిడ్ దాడి చేసిన సంగతి విదితమే. తాజాగా మరో ఘటన జరిగింది. ఢిల్లీలోని ఓకోర్టు ఆవరణలో కాల్పులు కలకలం రేపాయి.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన న్యాయ స్థానాల్లో కల్లోలిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న భార్యపై భర్త యాసిడ్ దాడి చేసిన సంగతి విదితమే. నైరుతి ఢిల్లీలోని ద్వారకలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు లాయర్లలా వచ్చి ఒక న్యాయవాదిని కాల్చి చంపారు. తాజాగా మరో ఘటన జరిగింది. ఢిల్లీలోని ఓకోర్టు ఆవరణలో కాల్పులు కలకలం రేపాయి. దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పలు జరిపినట్లు సమాచారం. లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా.. ఆమెను ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన సాకేత్‌లోని జిల్లా కోర్టులో జరిగింది.
ఢిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టులో కాల్పులు చోటుచేసుకున్నాయి. మహిళే లక్ష్యంగా కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఆర్థిక వివాదానికి సంబంధించి గొడవలు.. కోర్టుకు చేరుకోగా.. విచారణ కోసం హాజరైన మహిళపై కాల్పులు జరిపాడు దుండగుడు. లాయర్స్ బ్లాక్స్ లో ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఆమెపై కాల్పులు జరిపిన సమయంలో బాధితురాలు తన న్యాయవాదితో ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి రౌడీ షీటర్‌గా గుర్తించామన్నారు.