ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో 8 జట్లు ఉండగా కొత్తగా 2 టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానించింది. బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ఐపీఎల్ జట్టు కోసం బిడ్ వేసినట్లు సమాచారం. ఒక ప్రముఖ వ్యాపార సంస్థ భాగస్వామ్యంతో దీపికా, రణ్‌వీర్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నారు.
ఈ వార్తపై స్పందించిన టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ ఆ జట్టు జెర్సీ ఇన్‌ట్రస్టింగ్‌గా ఉండబోతుంది అంటూ తన ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ సొంత చేసుకుంది. మొత్తంగా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలను సీఎస్‌కే గెలుచుకుంది. ఇక ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం త్వరలో జరగనుంది. కాగా ఆటగాళ్ల రిటైన్ కొత్త రూల్స్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అసలు ఆటగాళ్ల రిటైన్ ఉంటుందా లేక రెండు కొత్త జట్లు రానుండడంతో అందరు ఆటగాళ్లును ఆక‌్షన్‌లో ఉంచుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్ జట్టు కోసం వేసిన బిడ్ దీపికా, రణ్‌వీర్‌కు దక్కితే ఏ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకుంటారో చూడాలి.
ఇప్పటికే కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, పంజాబ్ కింగ్స్‌కు ప్రీతిజింటా యాజమానులుగా ఉన్నారు. ఈ రెండు జట్లతో పాటు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు శిల్పా శెట్టి రూపంలో బాలీవుడ్ గ్లామర్ ఉంది. ఇప్పుడు దీపికా, రణ్‌వీర్‌తో మరో బాలీవుడ్ స్టార్ సపోర్ట్ ఉన్న ఐపీఎల్ జట్టును చూడబోతున్నాం.
ఇదీ చదవండి: ఐపీఎల్‌లో కూడా అడుగుపెట్టనున్న అదానీ.. ఏకంగా
The jerseys gonna be interesting for that team 😜 https://t.co/mH4tatYM9T
— DK (@DineshKarthik) October 22, 2021