ఈ ఫోటోలో బుగ్గలు పాలు కారుతున్నట్టు, ముద్దులొలికిస్తూ క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?. ఒక్క మలయాళంలో తప్ప మిగతా మెయిన్ లాంగ్వేజెస్‌లో సినిమాలు చేసింది.
ఈ ఫోటోలో బుగ్గలు పాలు కారుతున్నట్టు, ముద్దులొలికిస్తూ క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?. ఒక్క మలయాళంలో తప్ప మిగతా మెయిన్ లాంగ్వేజెస్‌లో సినిమాలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుని పాన్ వరల్డ్ యాక్ట్రెస్‌గా మారిపోయింది. స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టర్స్ పక్కన ఆడి పాడింది. చేసిన ప్రతి భాషలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హైట్, గ్లామర్, పర్ఫార్మెన్స్, ముఖ్యంగా సొట్టబుగ్గలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. సాధారణంగా కథానాయికలకు పెళ్లి తర్వాత పెద్దగా అవకాశాలు రావు. కానీ ఈ బ్యూటీ మాత్రం వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ తనెవరో కాదు. దీపిక పదుకొణె.
‘ఐశ్యర్య’ అనే కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన దీపిక.. షారుఖ్ ఖాన్ ‘ఓం శాంతి ఓం’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘బచ్నా ఏ హసీనో’, ‘లవ్ ఆజ్ కల్’,‘హౌస్ ఫుల్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘రామ్ లీల’, ‘హ్యాపీ న్యూఇయర్’, ‘పికు’, ‘పద్మావత్’, ‘పఠాన్’ ఇలా పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకాభిమానులను అలరించింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ త్రీడీ యానిమేటెడ్ పీరియాడ్ యాక్షన్ ఫిలిం ‘కొచ్చడయాన్’ లో ప్రిన్సెస్ వందనా దేవిగా కనిపించింది. తను చేసిన ఒకే ఒక తమిళ్ మూవీ ఇదే.
‘రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ అనే హాలీవుడ్ మూవీలోనూ మెప్పించింది. రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన పాన్ వరల్డ్ ఫిలిం ‘కల్కి 2898 AD’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌లో తన క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది విడుదలకానున్న ఈ చిత్రంతో నటిగా దీపికా రేంజ్ మరింత పెరుగుతుంది. 2012లో సహనటుడు రణ్వీర్ సింగ్‌తో డేటింగ్ స్టార్ట్ చేసి 2018లో అతడిని పెళ్లాడింది.