ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక జట్టే ఐపీఎల్‌లో ఉండేది. అదే సన్రైజర్స్ హైదరాబాద్. ఈ ఫ్రాంచైజీకి తెలుగు ఫ్యాన్స్ భారీగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే ఇకపై ఐపీఎల్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో 8 జట్లు ఉండగా కొత్తగా 2 టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానించింది. బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ఐపీఎల్ జట్టు కోసం బిడ్ వేసినట్లు సమాచారం. ఒక ప్రముఖ వ్యాపార సంస్థ భాగస్వామ్యంతో దీపికా, రణ్‌వీర్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ వార్తపై స్పందించిన టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ ఆ జట్టు జెర్సీ ఇన్‌ట్రస్టింగ్‌గా ఉండబోతుంది […]