'ఎప్పుడూ కూల్‌గా, డీసెంట్ గా కనపడే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. పార్టీల్లో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఇష్టపడడు' ఇది మనం అనుకునేది. కానీ, ధోని అసలు నిజాన్ని బయటపెట్టే ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూశాక.. 'హా.. ధోనీ కూడా మంచి కళాకారుడే..' అనక మానరు.
నాణేనికి ఒకవైపు బొమ్మ, మరోవైపు బొరుసు ఉన్నట్లే, భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీలో రెండో కోణం కూడా ఉంది. ఎప్పుడూ కూల్‌గా, డీసెంట్ గా కనపడే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. పార్టీల్లో పెద్దగా ఎంజాయ్ చేయడు అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు. ధోనీ అసలు రూపం మరొకటి ఉంది. వేదికపై అమ్మాయిలతో కలిసి బాగానే చిందులు వేయగలడు. అది చూశాక.. ‘పైకి కనపడే ధోని.. లోపలున్న ధోని రెండు వేరు వేరు ప్రపంచాలు అనిపించక మానదు.అలాంటి పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హోస్ట్ గా, స్టార్ ప్లస్ ఓ ప్రోగ్రాం నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకు భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన క్రికెటర్లందరూ హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని షోయబ్ అక్తర్, షాహిదీ ఆఫ్రీది, కమ్రాన్ అక్మల్.. ఇలా ఇరుజట్ల ఆటగాళ్లు అందరూ విచ్చేశారు. వీరితో హోస్ట్ బాద్ షా, బాగానే నవ్వులు పండించాడు. మొదట యువరాజ్ సింగ్ ను వేదికపైకి పిలిచిన షారుఖ్ ఖాన్ అతనిచేత వావ్ అనిపించేలా డ్యాన్స్ వేపించాడు. ఏమాటకామాట యువీ డ్యాన్స్ ఇరగదీశాడనే చెప్పాలి. అనంతరం ధోనీని స్టేజ్ పైకి పిలిచిన బాద్ షా, మొదట అతనికి కొన్ని ప్రశ్నలు సంధించాడు.
‘ధోనీ.. నీకు దీపిక పడుకునే అనే హీరోయిన్ గురుంచి తెలుసా..’ అని షారుఖ్ అడగ్గా, అందుకు ధోని బదులిస్తూ..’ఆమె నాకంటే యువీకి బాగా తెలుసు..’ అంటూ టాపిక్ డైవర్ట్ చేసేలా సమాధానమిచ్చాడు. అందుకు బాద్ షా.. ‘ఆ యువీకి తెలుసనుకో.. దీపిక అతనికి చెల్లెలు..’ అంటూ మరో బాంబ్ పేల్చాడు. ఆపై షారుఖ్ ఖాన్..ధోనీ కళ్ళకు గాగుల్స్ పెట్టించి, చేతికి రెండు గన్స్ ఇచ్చి ‘దునియామే.. లోగోనో..’ అంటూ ఓ బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ వేపించాడు. ఈ సాంగ్ లో ధోని తనదైన స్టయిల్ లో మెప్పించడమే కాదు, వెనకున్న అమ్మాయిలతో బాగానే చిందేశాడు. ఏమాత్రం మొహమాటం లేకుండా ధోనీ వారితో ఒంటిపై చేతులు వేపించుకోవడం, రాసుకోవడం.. పూసుకోవడం అంతా మరో లెవెల్. ఆ డ్యాన్స్ దృశ్యాలను సహచర ఆటగాళ్లు బాగానే ఎంజాయ్ చేశారు. ఇన్ని కళలున్నా ధోనీ, ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యాడన్నదే అసలు ప్రశ్న. ‘పైకి అలా కనిపిస్తూ.. రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్ లా మరో యాంగిల్ దాచేస్తున్నాడు..’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ వీడియోను తిలకించి.. మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.