అక్రమ సంబంధాలు సగటు మానవుడి జీవితాన్ని కుదేలు చేస్తున్నాయి. భార్య, భర్తల మధ్య గొడవలతో పిల్లలు నలిగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట సెలబ్రిటీ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల ఘటన అందుకు ఉదాహరణ. ఈ కేసు పలు ట్విస్టులు తీసుకుంది.
అక్రమ సంబంధాలు సగటు మానవుడి జీవితాన్ని కుదేలు చేస్తున్నాయి. భార్య, భర్తల మధ్య గొడవలతో పిల్లలు నలిగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట సెలబ్రిటీ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల ఘటన అందుకు ఉదాహరణ. ఈ కేసు పలు ట్విస్టులు తీసుకుంది. తొలుత ఇందులో ఓ సీరియల్ నటుడు ఉన్నాడన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఓ కుటుంబ సమస్య అని తేలింది. ఇందులో సిద్ధార్థ్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ వాడిన ఎయిర్ గన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ ప్రాంతానికి చెందిన సిద్దార్థ్ దాస్.. హిందూజా ధర్మల్ పవర్‌లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య స్మిత, ఇద్దరు పిల్లలున్నారు. అయితే మనస్పర్థల కారణంగా స్మిత, సిద్దార్థ్ 2019లో విడిపోయారు. అయితే ఆమె..సిద్దార్థ్ తన జోలికి రాకూడదంటూ కోర్టు నుండి నోటీసు తెచ్చుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా జీవిస్తుంది. ఈ క్రమంలో మనోజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి..వివాహేతర సంబంధానికి దారి తీసింది. మనోజ్ శ్రీకాకుళానికి చెందిన వాసిగా తెలుస్తోంది. వీరిద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీని రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారితో కలిసి జీవిస్తున్నాడు మనోజ్. అయితే స్మిత కుమారుడ్ని మనోజ్ దాడి చేయడంతో చైల్డ్ వెల్ఫేర్ కు ఫిర్యాదు చేశాడు. స్మిత కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 12న కొడుకును సిడబ్ల్యుసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు.. వారి సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ విషయం కుమారుడి ద్వారా సిద్దార్థ్‌కు తెలిసింది. తనతో పాటు చెల్లెల్ని కూడా మనోజ్ కొడుతున్నాడని తండ్రికి చెప్పాడు. ఈ విషయంపై ఈ నెల 18న సిడబ్ల్యుసి ముందు కుమార్తెను కూడా స్మిత హాజరు పర్చాల్సి ఉంది. అంతలో ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు సెలబ్రిటీ రిసార్ట్ విల్లా నెం 21లో ఉంటున్న స్మిత దగ్గరకు వెళ్లాడు సిద్దార్థ్. ఈ క్రమంలో అక్కడే ఉన్న మనోజ్‌తో గొడవ అయ్యింది. ఈ క్రమంలో అతడిని బెదిరించేందుకు ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు మనోజ్. అక్కడ నుండి తప్పించుకున్న సిద్దార్థ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి గన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. సిద్దార్థ్-స్మితల పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ సంరక్షణలో ఉన్నారు.