పెళ్లై చాన్నాళ్లు పిల్లలు కలగకపోతే.. వారి కోసం పరితపించిపోతారు దంపతులు. పిల్లలు పుట్టాలని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఇక మహిళలైతే ఉపవాసాలు, వ్రతాలు, నోములు నోచుకుంటారు. గోడ్రాలు అన్న పిలిపించుకోవడం కన్నా చనిపోవడం మేలని భావిస్తుంటారు.
పెళ్లై చాన్నాళ్లు పిల్లలు కలగకపోతే.. వారి కోసం పరితపించిపోతారు దంపతులు. పిల్లలు పుట్టాలని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఇక మహిళలైతే ఉపవాసాలు, వ్రతాలు, నోములు నోచుకుంటారు. గోడ్రాలు అని పిలిపించుకోవడం కన్నా చనిపోవడం మేలని భావిస్తుంటారు. అమ్మ అనే పిలుపు కోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. ఇక పిల్లలు పుట్టకపోతే.. అనాథశ్రమాల నుండో లేక మరో మార్గంలోనే పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటుంటారు. ఆ వేదన తెలుసు కాబట్టి.. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సామాన్యంగా ఇదే జరుగుతుంది. కానీ ఈ దంపతులు మాత్రం.. చాలా దారుణంగా ప్రవర్తించారు. పిల్లలు లేకపోవడంతో అబ్బాయిని దత్తత తీసుకున్నారు. తొలుత బాగానే చూసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు.. అతడికి నరకం ఎలా ఉంటుందో చూపించారు. ఈ బాధలను తాళలేక ఆ పిల్లవాడు కన్నుమూశాడు.
ఆ నరకయాతన చూపించిన తల్లిదండ్రులు డెల్మాంట్ కు చెందిన లారెన్, జాకబ్ మలో బెర్టీలు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగ్గా.. ఈ దంపతుల చిత్ర హింసల కారణంగా ఆ పిల్లవాడు చనిపోయాడని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో చెప్పడంతో.. వారిద్దరినీ అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..లారెన్, జాకబ్ మలో బెర్టీలు దంపతులు. వీరికి పిల్లలు లేకపోవడంతో పెన్సిల్వేనియాకు చెందిన లాండన్ అనే 5 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు. తొలుత బాగా చూసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తీవ్రంగా దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ ఏడాది జనవరి30న తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చి.. బతికించాలంటూ వైద్యులను వేడుకున్నారు. చివరకు ఆ దెబ్బలను తాళలేక పాపం పసివాడు కన్నుమూశాడు. అయితే బాబుకు చికిత్స అందించే సమయంలో వైద్యులకు కొన్ని అనుమానాలు వచ్చాయి.
లాండన్ తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించారు. చికిత్స చేస్తున్న సమయంలో విపరీతమైన నొప్పిని ఆ చిన్నారి అనుభవించడాన్ని వైద్యులు కళ్లారా చూశారు. దుర్భరమైన స్థితిలో చివరకు ఫిబ్రవరి 7వ తేదీన చనిపోయాడు. అయితే పోస్టుమార్టంలో పెంపుడు తల్లి లారెన్, జాకబ్ వేధింపుల వల్లే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి విచారించారు. వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జెక్కారెల్లీ తెలిపిన వివరాల ప్రకారం.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చికిత్స చేస్తున్న సమయంలో బాబు ఆపరేషన్ కోసం గోఫండ్ ద్వారా నిధులను సేకరించారని, వారికి 5 వేల డాలర్ల వరకు నిధులు వచ్చినట్లు తేలింది. పిల్లవాడు సరిగ్గా చదవడం లేదన్న కారణంగా తరచూ కొట్టేదని లారెన్ ఉద్యోగులు వెల్లడించారట. అలాగే అతడిని చంపేయాలన్న కసితో తల్లి రగిలిపోతూ ఉండేదని.. భార్యా భర్తల మధ్య జరిగిన ఫోన్ సందేశాలున్నట్లు వెల్లడైంది. అలాగే లాండన్ పెంపుడు తండ్రి జాకబ్.. లాండన్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించాడని, అతడిని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడని, అతడి ఏడుపులు వినిపించేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో కోర్టు వీరికి బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. ప్రస్తుతం వీరు వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ జైలులో ఉన్నారు.