సోషల్ మీడియా వచ్చాక లైకుల కోసం కొంతమంది ఏవేవో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వల్గారిటీ, బూతు కంటెంట్ ఉన్న వీడియోలు పెడుతూ లైకులు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక జంట తమ శోభనం రాత్రి వీడియోను పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తమ టాలెంట్ చూపించుకుని అవకాశం దొరికింది. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ చూపించి ఫేమస్ అవుతున్నారు. కొందరు మాత్రం వల్గర్ వీడియోలు పెట్టడం, ఎక్స్ పోజింగ్ వీడియోలు పెట్టడం కూడా టాలెంట్ అనే అనుకుంటున్నారు. ఈ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ లైకులు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే విషయం. ఆ లైకులు రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే పరిస్థితి. సంఘం ఇచ్చే లైకుల కోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా రెడీ. బెడ్ రూమ్, బాత్రూమ్ అంటూ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వీడియో తీసి పెట్టే జనం.. ఆఖరికి శోభనం వీడియోలు కూడా తీసే పరిస్థితికి వచ్చేసారు.
పెళ్లిని వీడియో తీసి పెడుతున్నారంటే అందం ఉంటుంది. మరీ నాలుగు గోడల మధ్య జరిగే కార్యాన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఏమనుకోవాలి? లైకుల కోసం మరీ ఇంత దిగజారడం అవసరమా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్ళైన కొత్త జంట.. తమ ఫస్ట్ నైట్ ఎలా జరుపుకున్నామో అని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘శోభనం రాత్రి మేము ఎలా గడిపామో’ అంటూ ఒక వీడియోను తీసి పోస్ట్ చేశారు. వీడియోలో దంపతులిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. భార్యకు ముద్దు పెట్టి.. భార్య వేసుకున్న ఆభరణాలు ఒక్కొక్కటిగా తీయడంలో సహాయపడుతున్నాడు ఆ భర్త.
అదర చుంబనం ఇచ్చి.. మెల్లగా దుస్తులు తీస్తుండగా వీడియో ఆగిపోతుంది. దీనికి ‘నిద్ర మత్తులో ఉన్న నా భర్త ఇలా సాయం చేశాడు’ అంటూ క్యాప్షన్ పెట్టింది సదరు యువతి. ఇక వాళ్ళ వీడియోకి తెగ లైకులు వచ్చేస్తాయి అని అనుకున్నారు కాబోలు. కానీ పట్టుమని 10 వేల లైకులు కూడా రాలేదు. పైగా దంపతుల తీరుపై మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేయడంతో కామెంట్స్ టర్నాఫ్ చేసుకున్నారు. మరి పడక గది విషయాలను పబ్లిక్ గా బయటపెడుతున్న ఇలాంటి వాళ్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.