హెల్త్ డెస్క్- కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. చాలా మది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో కరోనా పేరు వింటేనే అంతా వణికిపోతున్నారు. ఐతే కరోనా లక్షణాలను ముందుగా గుర్తించిన వారు వైద్యం తీసుకుని ప్రాణాలను దక్కించుకుంటున్నారు. కానీ కరోనాను ముందుగా గుర్తించకుండా, చివరి నిమిషంలో ఆస్పత్రికి వెళ్లినవారు మాత్రం బలైపోతున్నారు. అందుకే కరోనాను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. కరోనా మినిషి సరీరంలో ఉపిరితిత్తులపై దాడి చేస్తోంది. అందుకే కరోనా సోకిన వారికి శ్వాస సంబంందిత సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శ్వాసలోని తేడాను గమనించి మనకు కరోనా సోకిందా.. లేదా అన్నది ప్రాధమికంగా తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెెబుతున్నారు. ప్రతి ఇంట్లో సాద్యమైనంత వరకు ఆక్సీ మీటరు ఉంచుకోవాలి. ఐతే ఆక్సీమీటరుతో పరీక్ష చేసుకునే ముందు ఆరు నిమిషాలు నడవాలని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఆరు నిమిషాల నడవడం ఎందుకు, ఎలా మన శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోవాలన్న విషయాలను తెలుసుకుందాం…
ప్రస్తుతం కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ప్రధానంగా ఆరు నిమిషాల వాకింగ్ ద్వారా ఊపిరితీత్తుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా బాధితుల్లో ఆక్సిజన్ స్థాయిలు క్రమబద్దంగా ఉండవు. అందుకని పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా పరీక్షించుకుంటూ ఉండాలి. పల్స్ ఆక్సీ మీటర్‌ను చేతి వేలుకు పెట్టుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్‌లో కనిపించే ఎస్పీఓ2( SpO2) శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలియజేస్తుంది. ముందుగా పల్స్ ఆక్సీమీటర్‌ను మీ చూపుడు వేలుకు పెట్టుకోవాలి. తర్వాత ఎంత శాతం ఆక్సిజన్ ఉందో నోట్ బుక్ లో రాసుకోవాలి. ఆక్సీమీటర్‌ను వేలుకు ధరించి ఆరు నిమిషాల పాటు గదిలోనే వాకింగ్ చేయాలి.
ఆ తర్వాత మళ్లీ రెండోసారి పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించుకోవాలి. వాకింగ్ కు ముందు మొదటి సారి నమోదు చేసుకున్న ఆక్సిజన్ శాతం కంటే, వాకింగ్ చేశాక రెండో సారి పరీక్షించుకున్న సమయంలో ఆస్కీజన్ 3 శాతం తక్కువ ఉంటే కాస్త జాగ్రత్తపడాలి. ఇలా ప్రతి రోజు కనీసం రెండు నుంచి మూడుసార్లు ఈ పరీక్ష చేసుకోవాలి. ఆక్సీమీటర్ రీడింగ్ 94 కంటే ఎక్కువ నమోదైతే ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్లే. కానీ రీడింగ్ 94 కంటే తక్కువగా నమోదైతే మాత్రం ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నట్లు గుర్తించాలి. తక్కువ ఆక్సిజన్ శాతం నమోదైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. మీ ఆరోగ్యపరిస్థితిని బట్టి వైద్యులు కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తారు. కేవలం అవగాహన కోసం ఈ విషయాలను మీకు చెబుతున్నాం. కరోనా సోకితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.