అమెరికా- ఈ ప్రపంచంలో చాలా అరుదైన ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అద్భుతమైన ఘటనే అమోరికాలో జరిగింది. సాధారనంగా ఈ మధ్య కాలంలో గర్భిణిలంతా ఆస్పత్రిలోనే ప్రసవిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి విమానంలో ప్రసవాలు జరిగిన అరుదైన ఘటనలు చూస్తుంటాం.
కానీ అమెరికాలో ఏకంగా ఓ మహిళ కారులోనే ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అందులో ఆశ్చర్యం ఏముంది.. మన దేశంలో బస్సులో, ఆటోలో ప్రసవాలు జరుగుతూనే ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా. ఐతే ఆసలు విషయం ఏంటంటే.. కారు ఆటో పైలెట్ మోడ్ లో ఉండగా మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. వినడానికే చాలా కొత్తగా ఉంది కదా.
అమెరికాలో 33 ఏళ్ల యిరాన్ షెర్రీ నిండు గర్భిణీ. ఆమె తన భర్త కీటింగ్ షెర్రీతో కలిసి తమ మూడేళ్లు కొడుకును ఫ్రీ స్కూలుకి తీసుకువెళ్లేందుకు టెస్లా కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో యిరాన్ షెర్రీకి అనుకోకుండా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ దంపతులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లడానికి ప్రయత్నించగా, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఆస్పత్రికి వెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది.
అప్పుడు ఆమె భర్త కీటింగ్ షెర్రీ కారుని ఆటో పైలెట్ మోడ్‌లో పెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లమని వాయిస్ కమాండ్ ఆర్డర్ చేశాడు. దీంతో అక్కడి ట్రాఫిక్ ను అంచనా వేసిన కారు జీపీఎస్ నేవిగేషన సిస్టమ్ ఆసుపత్రికి వెళ్లడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుందని చెప్పింది. అతను ఒక చేయిని స్టీరింగ్ పై వేసి మరో చేత్తో భార్యను ఓదారుస్తుండగానే ఆమె కారు ఫ్రంట్ సీట్లో బిడ్డకు జన్మనిచ్చింది.
అలా టెస్లా కారు ఆటో పైలట్ మోడ్‌లో ఉండగా పుట్టిన తొలి పాపగా ఆ బిడ్డ రికార్డ్ సృష్టించింది. దీన్ని ఆమెరికా అధికారులు అధికారికంగా గుర్తించారు. ఆ తరువాత కారు ఆస్పత్రికి వెళ్లాక, కారులోనే బిడ్డ నుంచి తల్లి పేగును కట్ చేశారు డాక్టర్లు. ఈ మేరకు తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగానే తన భార్యకు సురక్షితంగా ప్రసవం అయ్యిందని ఆటోపైలట్ మోడ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి ఇచ్చినందుకు టెస్లా కార్ల కంపెనీకి ఆ దంపతులు కృతజ్ఞతలు చెప్పారు.