ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. కరోనా ప్రబలి యేడాదిన్నర కావస్తున్నా ఇంకా ఈ వైరస్ కు నిర్ధిష్టమైన ఔషదాన్ని కనిపెట్టలేదు. చాలా దేశాల్లో కరోనాను అడ్డుకునే మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు కొంత వరకు మాత్రమే కరోనాపై ప్రభావం చూపుతున్నాయి. కానీ కరోనాను వైరస్ ను పూర్తిగా అంతం చేసే ఔషధం మాత్రం ఇంకా రాలేదు. ఇటివంటి సమయంలో అమెరికా ఆస్ట్రేలియా బృందం ప్రపంచానికి శుభవార్తి చెప్పింది.
కరోనా కు మందు కనుక్కోవడంలో ఈ బృందం విజయం సాధించిందని ప్రకటించింది. గ్రిఫిత్ విశ్వవిద్యాలయానికి చెందిన మెంజీస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో కరోనా కోసం తయారు చేసిన ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఈ మందు విజయవంతంగా పనిచేసిందని వారు చెప్పారు. జీవకణాల్లోకి ప్రవేశించిన కరోనా వైరస్ వేగంగా అభివృద్ది చెంది, తమ సంతతిని పెంచుకోకుండా ఈ ఔషధం నిలువరిస్తుందని ప్రయోగాల్లో తేలింది. ఎలుకలపై ఈ ఔషదాన్ని ప్రయోగించినప్పుడు వైరస్ ప్రాటికల్స్ 99.9 శాతం మేర క్షీణించాయని నిపుణుల బృందం వెల్లడించింది.
అంటే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో ఈ మందు అడ్డుకుంటుందని పరీక్షల్లో తేలింది. ఈ ఔషధం మునుషులపై ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా సోకిన మనిషికి కేవలం ఐదు రోజుల పాటు ఈ మందును ఇస్తే కరోనా వైరస్ పూర్తిగా చనిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో మనుషులపై ప్రయోగాలను పూర్తి చేసి ఆ ఫలితాలను విశ్లేషించి వెంటనే మందును విడుదల చేసేందుకు గ్రిఫిత్ యూనివర్సిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఔషధం అందుబాటులోకి వస్తే కరోనా రోగులు ఇక కంగారు పడాల్సిన పనిలేదని చెప్పవచ్చు.