ఫిల్మ్ పొలిటికల్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖుల బయోపిక్ లు రాగా.. ఇక ముందుకు కూడా సెలబ్రెటీల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై యాత్ర పేరుతో బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఆయన తనయుడు ఏపీ సీఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బయోపిక్ రాబోతోందని సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్నట్లు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ సినిమా యాత్ర తో దర్శకుడు మహి.వి.రాఘవ సినీ ఇండస్ట్రీతో పాటు వైఎస్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సీఎం జగన్ బయోపిక్‌ను కూడా ఆయనే డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయాక, వైఎస్ జగన్ సొంత పార్టీని పెట్టడం, రాష్ట్రంలో పాదయాత్ర చేయడం, ఆ తరువాత ఆయన ఏపీకి ముఖ్యమంత్రి కావడం, ఈ క్రమంలో జగన్ రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ఘటనలు, సీబీఐ కేసులు, జైలు జీవితం… ఇలాంటి ప్రధానమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ తీస్తున్నారని తెలియగానే ఆయన పాత్రను ఎవరు పోషిస్తారన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. స్కాం 1992 సినమాలో ప్రధఆన పాత్ర పోషించిన నటుడు ప్రతీక్ గాంధీ వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ప్రతీక్ గాంధీ బాడీ లాంగ్వేజ్ సీఎం జగన్ పాత్రకు బాగా నప్పుతుందని దర్శకుడు రాఘవ ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ పైనా అప్పుడే సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ పై బయోపిక్ రానుందనే సమాచారంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని జగన్ అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది.