ఏపిలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచే పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార ప్రభుత్వం ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది పనుల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అప్పుల పాలు చేసిందని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ ఉద్యోగులను, సామాన్య ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది.
గత కొంత కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో 1.67 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హత ఉన్న 1.67 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2.11 కోట్ల మంది నిరుపేదలకు ప్రతి నెల 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకు ప్రతినెల రూ.846 కోట్ల ఖర్చు చేస్తున్నామని అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వార్త విని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.