సోషల్ మీడియా వినియోగం పెరిగాక దేని గురించి అయినా క్షణాల్లో జనాలకు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. అభిమానులతో ముచ్చటించడమే కాక.. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ కు తమకు చేతనైన సాయం చేసి.. అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో తాజాగా యాంకర్ ప్రదీప్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : మంత్రి కేటీఆర్ కు చెక్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్
యాంకర్ గానే కాక.. తన మంచి మనసుతో అభిమానులకు చేరువయ్యారు ప్రదీప్. తనకు వీలైనంత వరకు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు యాంకర్ ప్రదీప్. ఆర్థిక సాయం కోరుతూ ఓ నెటిజన్ చేసి ట్వీట్ కు స్పందించారు ప్రదీప్. సదరు నెటిజన్.. తాను బీటెక్ చదువుతున్నానని.. తన తండ్రి చనిపోయారని.. కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. తనకు సాయం చేయాల్సిందిగా కోరాడు. తన వివరాలు తెలియజేస్తూ.. ట్వీట్ చేశాడు.
Will try my best brother ..be strong
Pls send me the details https://t.co/tNenfmUUKw— Pradeep Machiraju (@impradeepmachi) December 29, 2021
ఇది కూడా చదవండి : యాంకర్ ప్రదీప్ కి నిహారిక షాక్! పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు!
సదరు నెటిజన్ ట్వీట్ పై ప్రదీప్ స్పందించాడు. తప్పకుండా సాయం చేస్తానని తెలిపాడు. ‘నాకు చేతనైన సాయం చేస్తాను బ్రదర్.. ధైర్యంగా ఉండండి.. మీ వివరాలు నాకు పంపించండి’ అని ప్రదీప్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ప్రదీప్ మంచి మనసుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రదీప్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.