విదేశాల్లో ఏదైనా వస్తువు కొనాలంటే అక్కడి కరెన్సీ ఉండాల్సిందే. లేదా డాలర్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన ఇండియన్ కరెన్సీ ఉన్నా అక్కడ వస్తువులు కొనచ్చు. ఓ ప్రముఖ సింగర్ విదేశంలో ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి బిల్లును మన భారతీయ రూపీస్ లో చెల్లించారు. ఇది నిజంగా భారతీయులంతా గర్వించాల్సిన విషయం.
వేరే దేశాల్లో భారత కరెన్సీ ఉపయోగించి ఏదైనా కొనాలంటే కుదరదు. ఆ కరెన్సీని ముందుగానే ఆ దేశ కరెన్సీతో మార్చుకుని తీసుకెళ్లాలి. ఆ దేశ కరెన్సీతోనే వస్తువులు కొనాలి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన దేశ కరెన్సీ ఉపయోగించి నేరుగా విదేశాల్లో కావాల్సిన వస్తువులు కొనుక్కునే కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాకారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 18 దేశాలతో అంతర్జాతీయంగా లావాదేవీలు జరిపేలా ప్రధాని మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో భారత కరెన్సీ ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా అవతారం ఎత్తుతోంది. ఈ క్రమంలో తన మొదటి బిల్లును భారత కరెన్సీతో చెల్లించినట్లు ప్రముఖ సింగర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ప్రముఖ సింగర్ మికా సింగ్ ఖతార్ లో ఉంటారు. ఈయన దోహా ఎయిర్ పోర్టులో లూయిస్ విట్టన్ స్టోర్ లో షాపింగ్ చేసి ఆ బిల్లును భారతీయ కరెన్సీలో చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘శుభోదయం. నేను దోహా ఎయిర్ పోర్టులోని లూయిస్ విట్టన్ స్టోర్ లో షాపింగ్ కోసం భారత కరెన్సీని ఉపయోగించడం చాలా గర్వంగా ఉంది. ఈ రూపాయలను ఏ రెస్టారెంట్ లో అయినా ఉపయోగించవచ్చు. ఇది అద్భుతం కాదా? నరేంద్ర మోదీజీ డాలర్ బదులు భారత రూపాయిని ఉపయోగించుకునేలా చేసిన మీకు భారీ సెల్యూట్’ అంటూ వీడియో ట్వీట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. 13 వేలకు పైగా దీన్ని ఇష్టపడ్డారు. 5 లక్షలకు పైగా ఈ అరుదైన సన్నివేశాన్ని తిలకించారు.
భారత కరెన్సీని ఖతార్ లో ఉపయోగించిన మికా సింగ్ ను నెటిజన్స్ అభినందిస్తున్నారు. మంచి విషయాన్ని షేర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయంగా భారత కరెన్సీ బలపడుతోంది. ఇది భారతదేశం యొక్క కొత్త శక్తిగా అభివర్ణిస్తున్నారు. కాగా ఖతార్ తో పాటు దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ కూడా భారత కరెన్సీని అంగీకరిస్తుంది. 2022లో బిజినెస్ ఇన్సైడర్ భారత కరెన్సీ ఆమోదించబడిన దేశాల జాబితాలో భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు, జింబాబ్వే ఉన్నాయి. ఇటీవల థాయ్ లాండ్, సింగపూర్ దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. యూపీఐ ద్వారా విదేశాల్లో చెల్లింపులు జరిపేలా కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
జనవరి నెలలో దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువైన 8 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. అయితే యూపీఐని అన్ని దేశాల్లోనూ ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. జీ-20 దేశాల సందర్శకులు భారతదేశంలో షాపింగ్ చేసే సమయంలో యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చునని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు మరో 10 దేశాల్లో కూడా భారతీయులు ఏప్రిల్ 30 నుంచి యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అంతర్జాతీయంగా డాలర్ కి ధీటుగా బలపడుతున్న భారత రూపాయిపై మీ అభిప్రాయమేమిటి? భారత కరెన్సీని అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకెళ్లిన ప్రధాని మోదీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Good morning.
I felt so proud to be able to use Indian rupees whilst shopping at #Dohaairport in the @LouisVuitton store. You can even use rupees in any restaurant.. Isn’t that wonderful? A massive salute to @narendramodi saab for enabling us to use our money like dollars. pic.twitter.com/huhKR2TjU6— King Mika Singh (@MikaSingh) April 12, 2023