ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇటు ఏపీ రాజకీయాల్లో, అటు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అంబటి రాయుడు.. గత కొన్ని రోజులుగా వార్తల్లో నానుతున్న పేరు. అయితే అది తన ఆటతో కాదు. మరి దేనితో అనుకుంటున్నారా? మీకు ఈపాటికే అర్దం అయ్యింది అనుకుంటా. ఏపీ రాజకీయాల్లోకి అంబటి రాయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్లుగానే రాయుడు కూడా తనకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టం అని చెప్పాడు. అయితే అతడు ఏ పార్టీలో చేరుతాడు అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరుతాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను తెలంగాణలో పోటీ చేయను, ఏపీలో పోటీ చేస్తానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సీఎం జగన్ స్పీచ్ పై ప్రశంసలు కురిపించాడు అంబటి రాయుడు. అందుకు సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు.
అంబటి రాయుడు.. టీమిండియాలోకి అలా వచ్చి ఇలా వెళ్లాడు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ రావాల్సినన్ని అవకాశాలు మాత్రం రాయుడికి రాలేదు. దాంతో తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం అద్భుతంగా రాణించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ తర్వాత రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన స్టేట్ మెంట్స్ ను ఇప్పటికే రాయుడు పాస్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మరోసారి పొలిటికల్ వార్తల్లో నిలిచాడు రాయుడు. లేటెస్ట్ గా అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఏపీ సీఎం జగన్ స్పీచ్ ను రాయుడు ట్వీట్ చేశాడు.
“గ్రేట్ స్పీచ్.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మీపై నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు” అంటూ.. క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్ తో రాయుడు త్వరలోనే వైసీపీ జెండా కప్పుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో.. ఈ ఐపీఎల్ తర్వాత రాయుడు రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారా అని అడగ్గా.. ‘లేదు.. తెలంగాణ నుంచి పోటీ చేయను. ఆంధ్ర ప్రదేశ్ నుంచి పోటీ చేస్తా’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. అంబటి రాయుడు సొంతూరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు. స్థానికంగా రాయుడి కుటుంబానికి అక్కడ మంచి పేరుంది. దాంతో అక్కడి నుంచే రాయుడు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి రాయుడు వైసీపీలో చేరుతాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Great speech ..our chief minister@ysjagan garu.. everyone in the state has complete belief and trust in you sir.. https://t.co/gw4s1ek1LR
— Ambati Rayudu (@RayuduAmbati) April 19, 2023