ఫిల్మ్ డెస్క్- మాచిరాజు ప్రదీప్.. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి కాదేమో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ టీవీ షో చూసినా అందులో ప్రదీప్ ఉండటం కామన్. ఢీ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చేయని టీవీ షోలు లేవనే చెప్పాలి. ఇక ఈ మధ్య సినిమాల్లో కూడా అరంగెట్రం చేశారు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు.
ఇక కాంట్రవర్సీకి దూరంగ ఉండేందుకు ప్రదీప్ ఎంత ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటారు. ఈ మధ్య కాలంలో ఓ అమ్మాయి తనను మోసం చేసిన వారిలో ప్రదీప్ కూడా ఉన్నారని చెప్పి, ఆతరువాత మాట మార్చిందనుకొండి. టీవీ షోలు, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రదీప్ యాక్డీవ్ గా ఉంటారు. ఈక్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ తో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రదీప్.
మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట దివ్యాంగులకు వాహనాలను అందిస్తున్న కేటీఆర్ కు, టీఆర్ఎస్ నేతలు, నాయకులు, ఇతరులు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ప్రదీప్ కూడా మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయనను కలిశారన్నమాట.
మంత్రి కేటీఆర్ ను కలిసి ప్రదీప్ ఆయనకు చెక్ అందజేశారు. ఈమేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన ప్రదీప్, ధ్యాంక్యూ సో మచ్ డియర్ కేటీఆర్ గారు.. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది సర్.. మీరు నిజంగా స్పూర్తి ప్రధాతలు.. గిఫ్ట్ ఏ స్మైల్ అనే ప్రోగ్రాం ఎంతో గొప్పది.. ఇందులో నా వంతుగా ఈ చిన్నపాటి సాయాన్ని అందిస్తున్నాను.. అని చెప్పుకొచ్చారు. ఐతే ప్రదీప్ ఎంత మొత్తం కేటీఆర్ కు అందించారన్నది మాత్రం చెప్పలేదు.