ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. జబర్దస్ట్ కామెడీ షోకు యాంకర్ గా అనసూయ ఎంత పాపులరో, సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అంతకనా క్రేజ్ సంపాదించుకుంది. మొన్న విడుదలైన అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప లో దాక్షాయణిగా నటించి మరింత పేరు తెచ్చుకుంది అనసూయ.
సినిమా రంగంలోకి ఎంటరైన తొలినాళ్లలో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ, ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఏరి కోరి ఎంచుకుంటోంది. అలాంటి ప్రత్యేకత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అనసూయ, అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో కూడా అలరిస్తోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో అనసూయకు సంబందించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. అనసూయ భరద్వాజ్ ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ కు తల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్ హీలో మరెవ్వరో కాదు, మాస్ మహారాజ రవితేజ అని సమాచారం. రవితేజ హీరోగా తెరకెక్కతున్న ఖిలాడి సినిమాలో అనసూయ హీరోయిన్ ను తల్లిగా నటిస్తోందట.
అన్నట్లు ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి వీరిద్దరిలో అనసూయ ఎవరికి తల్లిగా నటిస్తుందో మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా అనసూయ తల్లి పాత్రలు చేస్తోందంటేనే ఆమె అభిమానులు ఆలోచనల్లో పడ్డారట.