మంచి, చెడుల మధ్య అంతరం తెలుసుకోగల జ్ఞానం ఉంది కాబట్టే.., మనిషి మిగతా అన్ని జీవుల కన్నా అడ్వాన్స్ గా ఉన్నాడు. ఈ తెలివితేటలు కొన్నిసార్లు మంచి చేస్తే.., ఒక్కోసారి మనసులో అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి అనుమానులనే సోనూసూద్ విషయంలో వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్. కరోనా పోయిన ఏడాది మన దేశంలోకి అడుగు పెట్టినప్పటి నుండో సోనూ భాయ్ అలుపు ఎరగకుండా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. వలస కార్మికులకు కాలి నడక తప్పించి, స్వయంగా తన సొంత ఖర్చుతో వారందరిని గమ్యాలకి చేర్చాడు.
ఆ తర్వాత ఎవరు ఎలాంటి సహాయం అడిగినా సోనూసూద్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటి సెకండ్ వేవ్ లో అయితే.., హాస్పిటిల్ బెడ్స్ నుండి ఆక్సిజన్ వరకు అన్నీ అవసరాలను సోనూసూద్ ప్రజలకి తీరుస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో సోనూ నిలబెట్టిన ప్రాణాలు ఎన్నో. నిజానికి సోనూసూద్ చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమాలని ఎవ్వరూ కాదనలేరు, తప్పుపట్టలేరు. కానీ.., వీటన్నిటికీ ఈయనకి డబ్బు ఎక్కడ నుండి వస్తోంది? అసలు సోనూ ఆస్తులు ఎంత? ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఎలా నిర్మించకలుగుతున్నాడన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ పై కొన్ని ఆరోపణలు పుట్టుకొచ్చాయి.
దేశంలో ప్రభుత్వాల దగ్గర లేనన్ని హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలెండర్స్, రేమిడిసివర్ ఇంజక్షన్స్ సోనూసూద్ కి మాత్రమే ఎక్కడ నుండి వస్తున్నాయన్నది వీరి ప్రశ్న. దేశ ప్రజలు ఎక్కడ నుండి సహాయం కోసం ట్వీట్ చేసినా.. నిమిషాలలో వారికి సహాయం అందించే వ్యవస్థ ప్రభుత్వల దగ్గరే లేదు. అలాంటిది సోను సూద్ దగ్గర ఎలా ఉంది అన్నది మరో ప్రశ్న. నిజానికి సోనూ చేస్తోన్న సహాయం.. ఆయన పబ్లిసిటీ అంతటి స్థాయిలోనే ఉందా? లేదా? అంటూ కొంతమంది నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి తోడి ఇప్పుడు మరో సంచలన వార్త బయటకి వచ్చింది. 2020లో సోనూసూద్ కి సింగపుర్ నుండి రూ. 250కోట్ల ఫండ్స్ అందాయట.
ఇవన్నీ కూడా సింగపూర్ లో స్థిరపడిన ఓ చైనా కంపెనీ నుండి సోనూసూద్ కి అందినట్టు వార్తలు వస్తున్నాయి. చైనీయుల కారణంగానే ప్రపంచ దేశాలు అన్నీ కరొనాతో నాశనం అవుతుంటే వారు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఆర్ధిక సహాయం చేయలేదు. కానీ.., సోనూసూద్ కి మాత్రమే స్పెషల్ గా ఈ రూ 250 కోట్ల ఎందుకు అందినట్టు? సో.. ఇవన్నీ కూడా ఇప్పుడు సోనూసూద్ పై వస్తున్న ఆరోపణలు. దీనికి తోడు సోనూ శరద్ పవార్ మనిషి అని.., బీజేపీపైకి కాంగ్రెస్ వదిలిన అస్త్రం అని కూడా మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ.., సోనూ మాత్రం వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. ఆయన మాత్రం ప్రజలకి సహాయం అందించడంలోనే బిజీగా ఉంటున్నాడు. మరి రానున్న కాలంలోనైనా సోనూసూద్ ఈ విమర్శలపై స్పందిస్తాడేమో చూడాలి.