ఇటుక బట్టీలో పని చేసే ఇతడికి పాటలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని అలాగే వదిలేయకుండా.. పాటలు పాడి ట్విట్టర్ లో పోస్ట్ చేసేవాడు. అలాంటి వీడియోలే వైరల్ గా మారి చివరికి సోనూసూద్ వరకు వెళ్లింది. అతని ప్రతిభకు ఫిదా అయిన సోనూసూద్.. తన ప్రస్తుతం సినిమాలో పాట పాడేందుకు అవకాశాన్ని కల్పించారు.
అతనికి పాటలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని అలాగే వదిలేయకుండా బాలీవుడ్ లోని చాలా సినిమా పాటలను పాడుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసేవాడు. ఆ వీడియోలే సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. ఇక అదే వీడియోలు చివరికి సోనూసూద్ వరకు వెళ్లాయి. ఆ యువకుడి గాత్రానికి ఫిదా అయిన సోనూసూద్.. తన ప్రస్తుతం సినిమాల్లో పాట పాడేందుకు అవకాశం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరనే పూర్తి వివరాలు మీ కోసం.
బిహార్ లోని సమస్తిపూర్ ప్రాంతంలో అమర్ జిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి సినిమా పాటలంటే ఎంతో ఇష్టం. ఇష్టం కదా.. అని అతడు అలాగే వదిలేయలేదు. ఇటుక బట్టీల్లో పని చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్ సినిమాల్లోని పాటలు పాడుతుండేవాడు. అలా తన పాటను పాడుతూ వీడియోలు తీసుకుని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసేవాడు. అయితే ఇటీవల అమర్ జిత్.. దిల్ దే దియా హై… అనే పాట పాడి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఆ పాటను ఏకంగా 10 లక్షల మంది వీక్షించారు. చివరికి అదే వీడియో ఏకంగా సోనూసూద్ వరకు వెళ్లింది.
ఇక ఆ యువకుడి గాత్రానికి ఫిదా అయిన సోనూసూద్, ప్రముఖ సింగర్ సోనూ నిగమ్, నటి నీతూ చంద్ర వంటి వారు ఆ యువకుడి పాట వీడియోను రీట్విట్ చేశారు. చివరికి ఎలాగో సోనూసూద్ అమర్ జిత్ కి ఫోన్ నెంబర్ సంపాదించి అతని ఫోన్ చేసి మాట్లాడాడు. దీంతో పాటు తాను ప్రస్తుతం చేస్తున్న ఫతేహే చిత్రంలో పాట పాడేందుకు అమర్ జిత్ కు అవకాశం ఇచ్చారు. దీనిపై స్పందించిన అమర్ జిత్.. సోనూసూద్ తన ఫతేహే మూవీలో పాట పాడేందుకు అవకాశాన్ని కల్పించారని, ఈ అవకాశం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అమర్ జిత్ ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
Thank you sir https://t.co/OwrmByNdYI
— Amarjeet Jaikar (@AmarjeetJaikar3) February 22, 2023