ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ట్విట్టర్ లో ప్రముఖ సారంగి వాయిద్యకారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆయన.., వెంటనే అతని వైద్యానికి సాయం చేస్తానని ప్రకటించారు. ఇకపోతే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ ఎంతో మందికి సాయం చేశాడు. ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల వారిని వారి సొంత ఊళ్లకు బస్సుల్లో తన సొంత ఖర్చుతో వారి సొంత ఊళ్లకు చేరవేర్చడం వంటి ఎన్నో మంచి మంచి పనులు చేశారు. ఇక ఇదే కాకుండా సామాజిక మద్యమాల ద్వారా ఎక్కడ సాయం కోసం వేచి చూసిన.. నేనున్నానంటూ అపాద్బాంధవుడిలా ఎదురొచ్చి అందర్నీ అదుకుంటున్నారు.
అయితే హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లా ఖరక్ పూనియా గ్రామంలో ప్రముఖ వాయిద్యకారుడు మమన్ ఖాన్ (83) నివాసం ఉంటున్నాడు. తన సారంగి వాయిద్యాన్ని వాయిస్తూ ఎన్నో పాటలు పాడి ప్రముఖ సారంగి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో దేశాల్లో పాటలు పాడిన మమన్ ఖాన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకోవడం విశేషం. ఇదే కాక హర్యానా ప్రభుత్వం కూడా స్పందించి ఆయని అవార్డులతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజల నుంచి వాయిద్యకారుడు మమన్ ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇతనికి సాయం చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
దీంతో అతని ఆరోగ్య పరిస్థితి రోజు రోజకు క్షీణిస్తు వస్తుంది ఈ క్రమంలోనే మమన్ ఖాన్ ఆరోగ్య స్థితిపై స్పందించిన ఇంద్రిజి బర్కే అనే వ్యక్తి ట్విట్టర్ లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశాడు. అతని వివరాలను, ఫొటోను జత చేస్తూ అతని బాధపడుతున్న వ్యాధితో ఇతనిని ఎవరైనా ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు ట్విట్టర్ లో చూసిన సోనూసూద్ వెంటనే స్పందించారు. ఖాన్ సాహిబ్, ముందు మీ ఆరోగ్యం బాగా చేస్తా, ఆ తర్వాత మీ సారంగి పాట వింటాను అంటూ సోనూసూద్ ట్విట్టర్ లో రిప్లయ్ ఇచ్చాడు. ఇక మరోసారి సోనూసూద్ మంచి మనసును చాటుకోవడంతో నెటిజన్స్ సోనూసూద్ దేవుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో పాటు సారంగి వాయిద్యకారుడు వెంటనే కోలుకుని, మంచి మంచి పాటలు మరిన్ని పాడాలని కోరుతున్నారు.
ख़ान साहिब चलिए पहले आपको स्वस्थ करें, फिर आपकी सारंगी सुनेंगे❤️👍 https://t.co/oN2uP81ZLw
— sonu sood (@SonuSood) November 29, 2022