సినీ నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఇండియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కారణం ఆయన నటుడిగా కంటే గొప్ప మానవతా వాధిగా ప్రజల మదిలో నిలిచాడు. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అలానే సోనుసూద్ అభిమానులు తరచూ ఆయనపై ప్రేమను వివిధ రూపాల్లో చాటుకుంటారు.
సినీ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఇండియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కారణం ఆయన నటుడిగా కంటే గొప్ప మానవతా వాధిగా ప్రజల మదిలో నిలిచాడు. కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజల దేవుడిగా మారి.. వారి కష్టాలు తీర్చారు. ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది వలస కూలీలు, పేద ప్రజలకు ఆయన అండగా నిలిచాడు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించి.. రియల్ లైఫ్ లో రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని చాలా మంది కొనియాడారు. ఎంతో మంది ఆయనపై తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపించారు. తాజాగా ఆయన అభిమానులు ఓ అద్భుత దృశ్యాని ఆవిష్కరించారు. 2500 కేజీల బియ్యం సోనూ సూద్ బొమ్మను నేలపై ఆవిష్కరించారు.
సోనూసూద్ సినిమాలో మాత్రమే కానీ.. నిజ జీవితంలో ఆయనే హీరో. ఎందుకంటే సహాయం అన్న విషయం ఆయన చెవిన పడితే చాలు నేను ఉన్నానంటూ ముందుకొచ్చి సాయం అందిస్తారు. కష్టాల కాలంతో సోనూ సూద్ సాయం పొందిన వారంతా ఆయన్ని దైవ సమానంగానే చూస్తున్నారు. ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ సోనూ సూద్ పేరిట అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. వీటిని బట్టే అర్ధం చేసుకోవచ్చు… ప్రజల్లో ఆయన స్థానం ఎక్కడ అనేది. ఆయన స్ఫూర్తిగా మరెంతో మంది సేవా దృక్పథంతో ముందుకోస్తున్నారు. ఆయన అభిమానులు కూడా వివిధ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతానికి చెందిన సోనూ సూద్ అభిమానులు.. ఆయనపై వెరైటీగా తమ ప్రేమను చాటుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని దేవాస్లో ప్రాంతంలోని తుకోజీరావు పవార్ స్టేడియంలో ఎకరం స్థలంలో బియ్యంతో సోనూ సూద్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కోసం 2500 కేజీల బియ్యాని వినియోగించారు. ప్లాస్టిక్ కవర్ ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూ సూద్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోచూసిన నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఆర్ట్ వర్క్ గురించి మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం అభిమానులు కొన్ని గంటల పాటు శ్రమించినట్లు తెలుస్తుంది. తమ అభిమానాన్ని ఇలా బొమ్మ రూపంలో చాటుకోవడం పట్ల సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fans in Madhya Pradesh carve #sonusood‘s face using 2500 kilos of rice over one acre land which will be donated to the needy. pic.twitter.com/khVVS0rJ28
— Amit Karn (@amitkarn99) April 11, 2023