గుజరాత్- పిల్లలు పుట్టినప్పుడు కాదు వాళ్లు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం కలుగుతుంది. అంతే కాదు తమ కంటే పిల్లలు ఉన్నతస్థానంలో ఉండాలని అందరు పేరెంట్స్ కోరుకుంటారు. ఇక తాము పనిచేస్తున్న చోట.. తమకంటే పైస్థాయిలో తమ పిల్లలు ఉంటే తల్లి దండ్రుల ఆనంధానికి అంతు ఉండదు. గుజరాత్ లో విధినిర్వహణలో భాగంగా ఓ తల్లి తన కూతురుకు సెల్యూట్ చేయాల్సి వచ్చింది.
ఆ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం చూశాం. అంతే కాదు పోలీసులు శాఖలో ఉన్నతాధికారి అయిన కూతురుకు తండ్రి సెల్యూట్ చేయడం కూడా అందరిని ఆకట్టుకుంది. ఇదిగో ఇప్పుడు తాజాగా ఓ కన్నతల్లి ,ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోయింది.
గుజరాత్‌లోని అరవల్లి డీఎస్పీకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేసింది. సెల్యూట్ చేసిన ఏఎస్సై తల్లి కాగా, ఆమె చేత గౌరవ వందనం స్వీకరించిన డీఎస్పీ స్వయానా ఆమె కన్నకొడుకు. అవును ఇది నిజంగానే చాలా అరుదైన ఘటన. ఆ కన్న తల్లి మురిసిపోతూ ఎంతో సంతోషంగా ఉన్నతాధికారి అయిన కన్న కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలెట్ అవి చెప్పకతప్పదు.
ఈ అరుదైన దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేశారు. ఈ పోటో చూసి అంతా అబ్బురపడుతున్నారు. తల్లి కళ్లల్లో నిజమైన ఆనందాన్ని చూడాల్సిందేనంటూ నెటినజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.