ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుని చుట్టూ ఓ గుండ్రటి వలయం ఏర్పడిఅందరిని ఆకర్షించింది. ఇది చూసేందుకు ఇంద్రధనస్సు మాదిరిగా ఉన్నా.., గుండ్రంగా ఉండటం, సరిగ్గా అది సూర్యని చుట్టే ఏర్పడటంతో కొంతమంది భయాందోళనకి గురి అయ్యారు. మరికొంత మంది మాత్రం ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు సూర్యని చుట్టూ ఈ వలయాకారం ఎందుకు ఏర్పడింది? దీనికి సైన్టిఫిక్ రీజన్స్ ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి వలయకారాలు చంద్రుడి చుట్టూ ఏర్పడటం మనం చాలా సార్లు గమనించే ఉంటాము. వీటిని మన పెద్దలు చంద్రగుడి పిలిచేవారు. ఈ వృత్తం చిన్నదిగా ఏర్పడితే వర్షాలు లేటుగా వస్తాయని, పెద్దదిగా ఏర్పడితే వర్షాలు త్వరగా వస్తాయని లెక్క కట్టేవారు. అప్పట్లో వారు ఊహించినట్టే వర్షాలు కూడా పడేవి. కానీ.., సూర్యుడి చుట్టూ ఇలాంటి వలయాకారం ఏర్పడటం చాలా అరుదు. దీన్ని సైన్స్ పరిభాషలో చెప్పాలి అంటే సన్ హాలో ( sun Halo) అంటారు. వాతావరణంలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయి. దీన్నే కెలడోస్కోప్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. సూర్యుడి చుట్టూ మేఘాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి వలయం ఏర్పడుతుంది. ఈ వలయాకార వ్యాసార్థం.. దాదాపు సూర్యుడి చుట్టూ 22 డిగ్రీలు ఉంటుంది. అందుకే దీన్ని ‘22 డిగ్రీస్ హాలో’ అని కూడా పిలుస్తారు.
శీతల దేశాల్లో ఈ వలయం తరచుగా ఏర్పడుతుంది. కానీ మన దగ్గర ఇలా ఏర్పడటం చాలా అరుదు. మన మేఘాలలో మిలియన్ల కొద్దీ చిన్న మంచు స్ఫటికాలను కలిగి ఉంటాయి. ఇలాంటి సర్రస్ క్లౌడ్స్, మీద గాని, ఐస్ క్రిస్టల్స్ పై గాని, వాటర్ డ్రాప్ లెట్స్ పై గాని సూర్య కాంతి 90 డిగ్రీలలో పడినప్పుడు.., ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిన కాంతి తిరిగి కేంద్ర స్థానాన్ని చేరుకొని ఇలా వలయాకారం ఏర్పడుతుంది. ఇక సూర్య కాంతిలో మనం కంటితో చూడలేని చాలా రంగులు ఉంటాయి. కానీ.., ఎక్కువగా ప్రోజెక్ట్ అయ్యేది మాత్రం వైట్ లైట్ మాత్రమే. ఇందుకే ఇప్పుడు సూర్యుడు చుట్టూ ఏర్పడిన వలయాకారంలో మనకి ఇంద్రధనస్సులోలా అన్నీ రంగులు కనిపించలేదు. మనకి ఇక్కడ కనిపించింది కేవలం వైట్ లైట్ మాత్రమే. కాబట్టి ఇది ఇంద్రదనన్సు కాదు. సన్ హాలో మాత్రమే. ఇక చాలా మంది భయపడుతున్నట్టు ఈ సన్ హాలో సమయంలో వచ్చే కిరణాల నుండి మనవాళికి ఎలాంటి ముప్పు లేదు. చిన్న పిల్లలు, గర్భణీ స్త్రీలు సైతం బయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి తెలుసుకున్నారు కదా సన్ హాలో గురించి. మీ లైఫ్ లో ఫస్ట్ టైమ్ సూర్యుడిని ఇలా చూడగానే మీ మనసులో ముందుగా ఏమి అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.