యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వారం రోజులు క్రితం వరకు ఇతగాడు ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ.. కరాటే కళ్యాణితో వివాదం మూలంగా ఒక్క రాత్రిలోనే వైరల్ అయ్యాడు. ప్రస్తుతం చానెల్స్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఇతడి పేరు మారు మోగిపోతుంది. ఈ వివాదంలో కొందరు శ్రీకాంథ్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక వివాదం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక తాజాగా వివాదాలకే కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఆర్జీవీ ప్రేరణతో ఇండస్ట్రీకి వచ్చానని గతంలో చెప్పిన ఇతను.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి.. వర్మని బచ్చాగాడు అంటూ వ్యాఖ్యానించాడు. ‘ఆర్జీవీ నాకు ఇన్స్పిరేషన్ ఏంటి తొక్కా.. వాడు నా ముందు బచ్చా. నాకంటే గొప్పోడు కాదు. దమ్ముంటే నాతో డిబేట్‌లో కూర్చోమను.. నాతో మాట్లాడమను.. వర్మ ముసలోడు.. ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్. నేను వర్మని కించపరచడం లేదు కానీ.. కానీ జనరేషన్ మారే కొద్ది కొత్త వాళ్లు వస్తుంటారు. యువతే గొప్పవాళ్లు.. పెద్దవాళ్ల పంచాయితీ అయిపోయింది’’ అన్నాడు.
‘‘ఓరోజు వర్మ ఆఫీస్‌కి వెళ్తే.. అక్కడ ఉన్న అసిస్టెంట్‌లు నన్ను మందు బాటిల్స్ అడిగారు. తెచ్చి ఇచ్చిన తరువాత వర్మని కలవకుండానే వెనక్కి పంపేశారు. అప్పటి నుంచి ఈ యవ్వారాలు కరెక్ట్ కాదని.. నా పని నేను చేసుకున్నా. వీడియోలు తీయడం మొదలుపెట్టాను. అమీర్ పేటలో బజ్జీలు బండి పెట్టాను. నాలుగు రోజుల్లోనే పోలీసులు ఎత్తేశారు. రూ.50 వేలు లాస్ వచ్చింది.. ఆ తరువాత మళ్లీ ఇంటికి వెళ్లిపోయి మెడికల్ షాప్ పెట్టాను.. అక్కడ కూడా చాలా ఇబ్బందులు రావడంతో చివరికి హైదరాబాద్ వచ్చి ఈ పని మొదలుపెట్టాను’’ అని తెలిపాడు.
‘‘కరాటే కళ్యాణి ఇష్యూ వల్ల నాలో మార్పు ఏం రాలేదు.. నా దమ్ము ఏంటో నాకు తెలిసింది. కొట్టినా పర్లేదు.. ఫ్రీగా ప్రమోషన్ వచ్చింది.. ఇందులో తప్పేం ఉంది. నేను ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా.. ఆపాలని చూస్తే పోరాడుతూనే ఉంటా. నా వీడియోలు ఆపారంటే సినిమాల్లో ఐటమ్ సాంగ్‌లు కూడా తీసేయాలి. కొందరు హీరోయిన్లు సినిమాల్లో ఎలాంటి సీన్లు చేస్తున్నారో.. సోషల్ మీడియోలో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారో చూస్తున్నాం కదా. నా వీడియోలు వాటికంటే పర్వాలేదు. ఇప్పుడు యువత చెడిపోయేటంత ఖాళీగా లేదు.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. వీడియోలు చూసి యువత చెడిపోతారంటే కరెక్ట్ కాదు. నేను తప్పుడు పనులు చేస్తే నా ప్రాంక్ వీడియోల్లో చేసిన అమ్మాయిలే ముందుకొచ్చి నాకు సపోర్ట్‌గా నిలిచేవారా’’ అన్నాడు.
అంతేకాక ‘‘నేను కొత్తపేట గ్రామం అనే సినిమా తీస్తున్నా.. సన్నీలియోన్‌ని పెడుతున్నాం.. నేనే హీరో.. సన్నీతో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నాం.. మా ఫ్రెండ్ మహేంద్ర డైరెక్షన్ చేస్తున్నారు. ప్రొడ్యుసర్ కోసం ఎదురుచూస్తున్నా.. ఓ రెండు కోట్లు బడ్జెట్ పెడితే.. రెండుకి నాలుగు కోట్లు వచ్చేట్టు చేస్తా.. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్టు.. సన్నీ లియోన్‌ని పెట్టడానికి కూడా మార్కెట్ కోసమే. ప్రొడ్యుసర్ దొరికితే సన్నీలియోన్‌ని కలుస్తాం. సినిమా పడితే ప్రాంక్‌లు ఆపేస్తా. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఎక్కడికో వెళ్లిపోతానంటూ వ్యాఖ్యానించాడు శ్రీకాంత్ రెడ్డి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.