ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హాట్ లుక్స్ తో, ఎక్స్ పోజింగ్ తో కుర్రకారుని పిచ్చెక్కించింది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించిన ఈ బ్యూటీ ఫుట్ బాల్ లో ఎవరు గొప్పో చెప్పేసింది.
ఫుట్ బాల్ లో మెస్సీ గొప్పా? రోనాల్డో గొప్పా? ఎప్పటినుంచో ఈ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుత తరంలో ఫుట్ బాల్ గేమ్ లో వీరిద్దరు అనేక రికార్డులు నెలకొల్పారు. గత దశాబ్ద కాలంగా వీరిద్దరూ అత్యున్నత ఆటను ప్రదర్శిస్తూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. మొదటి వెయ్యి మ్యాచులు చూసుకున్నట్లైతే మెస్సీ 789 గోల్స్ చేస్తే, రొనాల్డో 725 గోల్స్ సాధించాడు.. మొత్తం ప్రస్తుతం రొనాల్డో 838 గోల్స్ సాధిస్తే, మెస్సీ 807 గోల్స్‌తో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో మెస్సీ 103 గోల్స్ సాధిస్తే, 123 గోల్స్ చేసిన క్రిస్టియానో రొనాల్డో.. అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ చేసిన ప్లేయర్‌గా ఆల్‌టైం టాప్‌లో ఉన్నాడు. అయితే ఈ ప్రశ్నకు తాజాగా సన్నీ లియోన్ షాకింగ్ రిప్లై ఇచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హాట్ లుక్స్ తో, ఎక్స్ పోజింగ్ తో కుర్రకారుని పిచ్చెక్కించింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉన్న ఈ అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫుట్ బాల్ క్రీడలో మీకు మెస్సీఇష్టమా? రోనాల్డో ఇష్టమా అనే ప్రశ్న ఎదరైంది. అయితే అందరిలా నాకు మెస్సీ అంటే ఇష్టమనో, లేక రొనాల్డో నా ఫెవరెట్ ఫుట్‌బాలర్ అని చెప్పకుండా సర్‌ప్రైజింగ్ ఆన్సర్ ఇచ్చింది సన్నీ.
‘మనవాడు సునీల్ ఛెత్రీ ఉన్నాడుగా..’ అంటూ సునీల్ ఛెత్రీ ఫోటోను పోస్ట్ చేసింది సన్నీ లియోన్. ఈ పోస్టుతో అభిమానులను ఇంప్రెస్స్ అవ్వగా.. ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సౌతా ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ గోల్స్ సాధించిన భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆల్‌టైం ఫుట్‌బాల్ ప్లేయర్లలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. మొత్తానికి ఎవ్వరు ఊహించని ఆన్సర్ ఇచ్చిన సన్నీ.. దేశం మీద అభిమానం చాటుకుంది. మరి సన్నీ లియోన్ చెప్పిన సమాధానం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
This statement from @SunnyLeone won my heart ❤️💜
Always support our Indian footballers.@chetrisunil11.#SunnyLeone #sunilchhetri #justiceforsunilchhetri @IndianFootball #indianfootballteam #IFT pic.twitter.com/SjO0AremIa— NazimxVirat¹⁸👑 (@Nazimtweeet) June 24, 2023