ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్-2’ హవా నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే 300 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ మాఫియా సినిమా.. బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో ఉరకలెత్తిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా కలెక్షన్స్ – నెంబర్స్ – రికార్డులు అంటూ పరుగులు తీస్తోంది.
ఈ క్రమంలో రాకింగ్ స్టార్ యష్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ – నెంబర్స్ – కోట్లు – రికార్డులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యష్ మాట్లాడుతూ.. “సినిమా అనేది 100 కోట్లు, 1000 కోట్ల గురించి కాదు. రాను రాను ఈ నెంబర్ గేమ్ బ్యాడ్ అయిపోతుంది. నేను చూసాను.. బాహుబలి మూవీ హిందీలో 500 కోట్లు వసూల్ చేసింది. దంగల్ సినిమా 375 కోట్లు వసూల్ చేసినా వారు ఇంతేనా అని ఫీల్ అయిపోయారు.
అలా చెప్పకూడదు.. ఆ జానర్ ఆ సినిమా ది బెస్ట్ రాబట్టింది. అందరూ అన్ని సినిమాలు చూడాలని ఏం లేదు. 5 కోట్ల సినిమా 15 కోట్లు వసూల్ చేస్తే అది పెద్ద సినిమా. మీ సినిమాను అంత మంది చూశారని అర్థం. అది ముఖ్యం. సినిమాలను అలా చూడాలి కానీ కోట్లు, నెంబర్స్ ముఖ్యం కాదు. ఆ ప్రెషర్ ఉండకూడదు. క్రోర్స్ – క్లబ్ అని” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యష్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.