అన్ స్టాపబుల్ 2.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సెలబ్రిటీ టాక్ షో ఇది. ఆహా ఓటిటి వారు టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. విజయవంతంగా రెండో సీజన్ పూర్తి చేసుకుంటోంది. టాలీవుడ్ బిగ్ స్టార్స్ ఒక్కొక్కరిగా షోకి రావడంతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంతరించుకుంది అన్ స్టాపబుల్ 2. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో అడుగు పెట్టాడు. ఇంకేముంది.. ఎప్పటినుండో వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్లు అయ్యింది. ఎందుకంటే.. ప్రభాస్ ఎప్పుడూ పెద్దగా షోలలో కనిపించడు, పెద్దగా మాట్లాడడు.
ప్రభాస్ అంటేనే అందరికి ముందుగా అతని మొహమాటం, సిగ్గు గుర్తొస్తుంటాయి. ఈ క్రమంలో గలగలా మాట్లాడుతూ.. వచ్చిన గెస్ట్ లతో కూడా అదేవిధంగా మాట్లాడించగల బాలయ్య షోలో ప్రభాస్ మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడకపోతే బాలయ్య ఊరుకుంటాడా.. ఫ్యాన్స్ కోరికలు ఏంటో బాలయ్యకి బాగా తెలుసు. అందుకే ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఏమేం తెలుసుకోవాలి అనుకుంటున్నారో.. అవన్నీ కూలంకషంగా అడిగి బయటపెట్టే ప్రయత్నం గట్టిగానే చేశాడు బాలయ్య. కానీ.. ప్రభాస్ దగ్గరే చెప్పడానికి ఏమి లేవని ఎపిసోడ్ చూసిన ఫ్యాన్స్ కి అర్థమైంది. ఎందుకంటే.. బ్యాచిలర్ గా ఉన్న ఏ హీరో నుండైనా ఫ్యాన్స్.. లవ్, మ్యారేజ్ లాంటి అప్ డేట్స్ వినాలని చూస్తుంటారు. ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది.
పైగా ప్రభాస్ లైఫ్ లో ప్రెజెంట్ ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడానికి ఏకంగా హీరో రామ్ చరణ్ కే కాల్ చేసి మాట్లాడారు. బాలయ్య అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పిన చరణ్.. త్వరలోనే ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని హింట్ ఇచ్చినట్లే ఇచ్చి.. అదేం లేదని తేల్చేశాడు. అయితే.. తెలుగు ప్రేక్షకులని, సౌత్ ఆడియెన్స్ ని ప్రభాస్ ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంది. మరి నార్త్ ఆడియెన్స్ సంగతేంటీ? అనేది అసలు సందేహం. ఎందుకంటే.. ప్రభాస్ కి సౌత్ తో పాటు నార్త్ లోనూ అంతే క్రేజ్ ఉంది. అదీగాక నార్త్ లో బాలీవుడ్ ఖాన్స్ త్రయంతో సమానమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆహాలో ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ని వాళ్ళు కూడా చూస్తుంటారు.
మరి నార్త్ ఆడియెన్స్ కి ప్రభాస్ ఎపిసోడ్.. తెలుగు, సౌత్ వాళ్ళకి ఎక్కినట్లుగా ఎక్కుద్దా? షోలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ తో పాటు మాట్లాడిన విధానం కూడా పక్కా బుజ్జిగాడు మూవీ డైలాగ్స్ యాసలో మాట్లాడేశాడు. అదీగాక కేవలం తెలుగులోనే మాట్లాడాడు. ఓకే.. తెలుగు షో కాబట్టి.. తెలుగులో మాట్లాడాడు అనుకుందాం. కానీ, ప్రభాస్ క్రేజ్ నార్త్ లో కూడా భీభత్సంగా ఉంది కదా! అందుకోసమే ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ వేశారు అంటారా! సబ్ టైటిల్స్ వేసి.. ప్రభాస్ గలగలా ఏం మాట్లాడాడో అర్థం చేసుకోవడానికి నార్త్ వాళ్ళు రెడీగా ఉన్నారా? పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడంటే.. అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఎంతలా అంటే.. ఎపిసోడ్ రిలీజ్ అయితే ఓటిటి క్రాష్ అయ్యేలా! ఇంకా ఇది ఫస్ట్ ఎపిసోడే.. రెండో ఎపిసోడ్ కి ఫ్యాన్స్ ఏం చేస్తారో! నార్త్ వాళ్ళు ప్రభాస్ ఏం చెబుతున్నాడో అర్ధం చేసుకుంటే అదే పదివేలు అనుకోమంటారా అంటే.. అవుననే అంటున్నారు ఫ్యాన్స్. సో.. ప్రభాస్ ఎపిసోడ్ కి నార్త్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రానుందో చూడాలి! మరి బాలయ్య షోలో ప్రభాస్ యాటిట్యూడ్, మాటతీరు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.