“పుష్ప”.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సృష్టిస్తున్న పేరు ఇది. చిన్నవాళ్ళ నుండి పెద్దవారి వరకు, సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు, ఆటగాళ్ల నుండి పాటగాళ్ల వరకు.. అందరి నోటా ఒక్కటే మాట.. “తగ్గదే లే”! ఒక రీజనల్ మూవీగా మొదలై, అతి కష్టం మీద పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్పకి.. ఇలా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎలా దక్కినట్టు? బాక్సాఫీస్ తో పాటు.., సోషల్ మీడియాని కూడా పుష్పరాజ్ ఎలా కుమ్మేస్తున్నట్టు? “ఇది సర్ నా బ్రాండ్” అని చాటుతూ.. పుష్ప పాన్ వరల్డ్ స్థాయికి ఎలా ఎగబాకినట్టు? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఓ తెలుగు సినిమా అభిమానిగా గర్విద్దాం.
సుకుమార్ టచ్:
“పుష్ప.. 10 కేజీఎఫ్ లతో సమానం”.. దర్శకుడు బుచ్చిబాబు ఈ మాట అనగానే అందరూ నవ్వారు. కానీ.., అక్కడ ఉంది లెక్కల మాస్టర్ సుకుమార్. గురువుగా తన శిష్యుడు లెక్క తప్పకుండా చేశాడు. ఈరోజు సోషల్ మీడియాలో పుష్ప సాధించిన క్రేజ్.. గతంలో ఏ సినిమాకి దక్కలేదు. బాహుబలితో సహా! దీనికి కారణం సుకుమార్ మార్క్ మేకింగ్. సుక్కు ఓ కమర్షియల్ సినిమా తీస్తే మమ్మల్ని దాటి పోతాడని రాజమౌళి చాలా ఏళ్ళ క్రితమే కామెంట్స్ చేశారు. పుష్ప విషయంలో సుక్కు ఆ స్థాయిని అందుకున్నాడు. స్క్రీన్ ప్లే, టేకింగ్, డైరెక్షన్ అన్నీ విషయాల్లో పుష్ప మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. కథలో ఉన్న రా అండ్ రస్టిక్ ఫ్లేవర్ స్క్రీన్ పై మిస్ కాకుండా చూసుకున్నాడు. ఓ సామాన్యుడు తనని తాను రాఖీ భాయ్ లా ఊహించుకోలేడు. కానీ.., సింపుల్ గా కనిపించే పుష్ప రాజ్ లో తనని తాను చూసుకోగలడు. ఇక్కడే పుష్ప.. కేజీఎఫ్ స్థాయిని దాటేసింది. ఈ విషయం అందరికీ అర్ధం అవ్వడానికే కాస్త సమయం పట్టింది.అల్లు అర్జున్ కష్టం:
ఒక్కోసారి పేరు సాధించడం కన్నా.., పేరు పెట్టుకోవడమే కష్టం. పెట్టుకున్న ఆ పేరుని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. పుష్ప రిలీజ్ తరువాత బన్నీ ఇండస్ట్రీలో ఐకాన్ కాబోతున్నాడన్న విషయాన్ని పుష్ప టీమ్ బలంగా నమ్మింది. ఐకాన్ స్టార్ గా తన హీరోకి పేరు మార్చుకున్నాడు సుకుమార్. ఇంత నమ్మకానికి కారణం ఆ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టమే. పుష్ప కోసం అల్లు అర్జున్ లుక్ మారింది. తన స్టయిల్ పోయింది. తనలా డ్యాన్స్ తాను వేయకూడదు. తనలా తాను ఫైట్స్ చేయకూడదు. కనీసం తనలా తాను మాట్లాడకుడదు. ఇన్ని ఛాలెంజ్ లను అల్లు అర్జున్ ఆనందంగా స్వీకరించాడు. తగ్గదే లే అంటూ సినిమా కోసం తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చాడు. పుష్పరాజ్ పాత్రలో తన విశ్వరూపమే చూపించాడు. ఈరోజు భాషతో సంబంధం లేకుండా, పుష్పరాజ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ అయ్యింది అంటే.. దానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధానం కారణం.
OTT రిలీజ్, క్యూ కట్టిన సెలబ్రెటీలు :
పుష్ప బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లను రాబట్టింది. మేకర్స్, ఫ్యాన్స్, యాక్టర్స్ అంతా హ్యాపీ. కానీ.., ఒక్కటి తగ్గింది పుష్ప అని.. ఏదో వెలితి. ఆ క్షణాన పుష్ప ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అక్కడ నుండి లెక్కలు మారిపోయాయి. పుష్పరాజ్ సామాన్య ప్రేక్షకులని దాటుకుని, సెలబ్రెటీలను ఆకర్షించడం మొదలు పెట్టాడు. వారికి పుష్ప బాగా నచ్చేసింది. ఇంకేముంది..? అంతా పుష్ప మాయలో పడిపోయారు. అంతా రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు.. ఆ పుష్ప రీల్స్ చేస్తూనే ఉన్నారు.రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, అయ్యర్, హార్దిక్ పాండ్య, డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రేవో.. ఇలా ఒక్కరేంటి? అంతా పుష్ప రీల్స్ చేయడంలో బిజీ అయిపోయారు. తరువాత క్రికెట్ లీగ్, ఫుట్ బాల్ లీగ్ లలో కూడా “తగ్గదే లే” అనే డైలాగ్ కామన్ అయిపోయింది. ఇక శ్రీవల్లి పాటకి ఇన్ స్టాలో మిలియన్ రీల్స్ దాటిపోయాయి. దీంతో.. పుష్ప క్రేజ్, రేంజ్ ఖండాంతరాలను సైతం దాటిపోయింది.
పుష్ప రీల్స్ ఎందుకు చేస్తున్నారు?:
ఇప్పుడున్న డిజిటిల్ యుగంలో ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీనే. ఇంతమంది సెలబ్రెటీలు పుష్ప రీల్స్ చేయడం వెనక కూడా ఈ బిజినెస్ సీక్రెట్ దాగి ఉంది. పుష్ప కి పాన్ వరల్డ్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ని వాడుకుంటూ పుష్ప పై రీల్స్ చేస్తే.. ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు అన్నది సెలబ్రెటీల ఆలోచన. తాజాగా డేవిడ్ వార్నర్ ఇన్ స్టా పేజ్ 8 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకుంది. అదంతా ఇలాంటి రీల్స్ పుణ్యమే. ఏ డిజిటిల్ ప్లాట్ ఫామ్ కైనా ఇండియా పెద్ద బిజినెస్ సర్కిల్. కాబట్టే.. మన సినిమాల మీద ఇప్పుడు సెలబ్రెటీలంతా రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పుష్ప ఒక ప్రభంజనం అయిపోయింది.పాన్ వరల్డ్ గా పుష్ప:
త్రివిక్రమ్ చెప్పినట్టు అద్భుతం జరిగక ముందే గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ.., జరిగాక ఆ అద్భుతాన్ని క్యాష్ చేసుకోవచ్చు కదా? ఇప్పుడు పుష్ప మేకర్స్ కూడా ఇలాంటి ఆలోచనే చేయాలి. అనుకోకుండా.., పుష్పకి పాన్ వరల్డ్ క్రేజ్ వచ్చి పడింది. ఎలాగో “పుష్ప-2” ఇంకా మేకింగ్ లెవల్ లోనే ఉంది. కాబట్టి.. ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకుని, “పుష్ప-2” ని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తే..? బాక్స్ బద్దలు అవ్వడం ఖాయం. తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు పైకి ఎక్కడం ఖాయం. మరి.. పుష్ప మేకర్స్ ఈ గోల్డెన్ ఛాన్స్ ని అందిపుచ్చుకుంటారా? ఫ్యాన్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. మరి.. పుష్ప మూవీకి ఈ స్థాయి ఆదరణ దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.