పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు.. తెలుగు రాష్ట్రాలలో కోట్లాది అభిమానుల ఎమోషన్. ఆ పేరులో ఎంత పవర్ ఉందో.. దాని వెనుక బాక్సాఫీస్ ని షేక్ చేసిన చరిత్రతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎవరిని నిలదీయాలన్నా, ఎదురించి ప్రశ్నించాలన్నా.. పవర్ స్టార్ వెనుక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ ఫాలో అవ్వరు.. ఎల్లప్పుడూ ట్రెండ్ సెట్ చేయడానికే ట్రై చేస్తుంటారు. దాదాపు 26 ఏళ్ల క్రితం మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ టైమ్ లోనే ‘పవర్ స్టార్’ అని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
అప్పటినుండి ప్రతి సినిమాకి ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతూ.. పెరుగుతూ ఇప్పుడు మహాసంద్రంలా మారిపోయింది. పవన్ కళ్యాణ్ హిట్స్ తీసినా, ప్లాప్స్ పడినా ఇన్నాళ్లు వెనకుండి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. అలాంటి కల్ట్ ఫ్యాన్స్.. కొత్తగా ఓ సినిమా రీమేక్ విషయంలో నిరాశచెందుతూ.. ఆ సినిమా రీమేక్ వద్దని రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కెరీర్ లో చాలా సినిమాలు రీమేక్ చేశాడు. కానీ.. ఎప్పుడూ కూడా ఫ్యాన్స్ మాకీ సినిమా వద్దని వారించలేదు. సినిమాలు నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. అంతెందుకు వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు పవర్ స్టార్ కి, ఫ్యాన్స్ కి ఊపిరినిచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’.
ఇదికూడా రీమేక్ సినిమానే. కానీ.. రీమేక్ సినిమా అని ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా ఓ కల్ట్ హిట్ అందించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అతను పవన్ ఫ్యానే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంగ్ సినిమాకి రీమేక్ గా 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా.. ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఒరిజినల్ సినిమాని మించి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ కి కల్ట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. ఇక మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు హరీష్ శంకర్.
ఆ మాట చెవిలో పడగానే.. హమ్మయ్య మొత్తానికి వీరి కాంబినేషన్ లో కొత్త సినిమా సెట్ అయ్యిందని సంతోషించారు. అయితే.. రెండేళ్లు దాటినా ఈ సినిమాపై క్లారిటీ రాలేదు.. కొత్తగా మరో సినిమా రీమేక్ అంటూ వార్తలు వచ్చేశాయి. ఇప్పటివరకు పవన్ రీమేక్ సినిమాలు చాలా చేశాడు.. కానీ, ఆయన స్థాయి ఇప్పుడు వేరు. రోజురోజుకూ పవర్ స్టార్ క్రేజ్.. సినిమాలకు, రాజకీయాలకు అతీతంగా పెరుగుతూ పోతుంది. ఇలాంటి తరుణంలో.. ఆల్రెడీ తమిళంతో పాటు తెలుగులో డబ్ అయిన సినిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ తో రీమేక్ అనేసరికి ఫ్యాన్స్ నీరుగారిపోతున్నారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఫ్యాన్స్ కోరుకుంటుంది రీమేక్ సినిమాలు కాదని ధిక్కరించి చెబుతున్నారు.
ట్విట్టర్ లో గమనిస్తే విషయం ఏంటనేది అర్థమవుతుంది. దళపతి విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన పోలీస్ యాక్షన్ డ్రామా ‘తేరి’. ఇది తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయ్యింది. పైగా అన్ని ఓటిటిలలో.. యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. జనాలు ఇప్పటికే చాలాసార్లు సినిమా చూసేశారు. కానీ.. ఇప్పుడా సినిమానే పవన్ రీమేక్ చేస్తున్నాడని తెలిసి.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్న కథనే మళ్లీ రీమేక్ చేయడం.. పైగా గొప్ప కథ కూడా కాదు.. ఆ సినిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయడం ఏంటని ట్విట్టర్ లో “వి డోంట్ వాంట్ తేరి రీమేక్” అంటూ తమ ఆవేదనను తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.
ఎంతోకాలంగా పవన్ నుండి ఒరిజినల్ కథలను ఎక్సపెక్ట్ చేస్తున్నారు అభిమానులు. పైగా పదేళ్ల తర్వాత హరీష్ శంకర్ తో సినిమా అంటే.. మాస్ జానర్ లో నెక్స్ట్ లెవెల్ సినిమాని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ కథలను కాదని, తేరి రీమేక్ ఓకే చేయడం ఫ్యాన్స్ ని బాధిస్తున్న విషయం. ఇది కోపం కాదు.. వ్యతిరేకత అంతకన్నా కాదు.. కేవలం రీమేక్స్ వద్దు అనే ఆవేదనలో నుండి వచ్చిన ప్రేమాభిమానాలు మాత్రమే. పవర్ స్టార్ ఏం చేసినా ఫ్యాన్స్ ఎప్పుడూ వెనకే ఉంటారు.. కానీ, అదే పవర్ స్టార్ రీమేక్ సినిమాలతో వెనకబడి పోవడం చూడలేమని.. చెప్పకనే చెబుతున్నారు. రీసెంట్ గా సుజీత్ తో ‘ఓజి’ మూవీ అనౌన్స్ చేసి కిక్కిచ్చిన పవన్.. తేరి రీమేక్ విషయంలో మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ విన్నపం. ఫ్యాన్స్ ఆవేదన దృష్టిలో పెట్టుకొని పవన్ నుండి కొత్త పిలుపు రానుందేమో చూడాలి.
#WeDontWantTheriRemake trending. Pawan Kalyan fans want a straight subject film and not a remake. Thoughts? pic.twitter.com/n7lBF5yh2w
— LetsCinema (@letscinema) December 8, 2022
#WeDontWantTheriRemake is being Trended by the fed-up Pawan Kalyan and Telugu Cinema Fans! The trend of remaking, even when dubbed release already happened, is unhealthy to say the least!
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 8, 2022