బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగష్టు 11న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఆమిర్ ఖాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ తీసుకున్నప్పటీకీ, ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంటాడు. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాతో కూడా మంచి హిట్ కొడదామని చూస్తూ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నాడు.
ఈ క్రమంలో సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమిర్ ఎప్పుడో గతంలో చేసిన వ్యాఖ్యలను తెరమీదికి లాగి హిందుత్వ వ్యతిరేఖవాదిగా ఆరోపిస్తున్నారు. ఆ కారణంతోనే బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ.. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మీమ్స్ తో సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుందని ఆమిర్ కూడా స్పందించాడు.
తన సినిమాను బాయ్ కాట్ చేయొద్దని విజ్ఞప్తి చేశాడు ఆమిర్. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని అంటున్నారు. అది అవాస్తవం. అలా అంటున్నందుకు బాధ కలుగుతోంది. కొందరి మనసుకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ, నేను ఈ దేశాన్ని ఇష్టపడతాను. దయచేసి నా సినిమాను ఆపాలని చూడకండి. సినిమాని అందరూ చూడండి అంటూ రిక్వస్ట్ చేశాడు. మరి అసలు ఆమిర్ సినిమాను బాయ్ కాట్ ఎందుకు చేయాలనీ అనుకుంటున్నారు? ఆమిర్ గతంలో చేసిన వ్యాఖ్యలేంటి? అనేది చూద్దాం.
గతంలో ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ అనే టెలివిజన్ షోలో సమాజంలో ఉన్న అసమానతలను చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పట్లో దేవుళ్లకు చేసే క్షీరాభిషేకాలపై విమర్శలు చేశారు. శివలింగానికి పాలాభిషేకం చేసే బదులు, ఆ పాలను పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించవచ్చు అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అప్పటినుండి హిందుత్వ సంఘాలు భగ్గుమంటున్నాయి. అదీగాక తన ఫ్యామిలీకి ఇండియాలో భద్రత లేదని, నాకు ఇండియాలో ఉండాలనిపించటం లేదంటూ 2015లో వ్యాఖ్యలు చేశాడు.
అప్పటి ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దాదాపు ఆ వ్యాఖ్యలు చేసి కూడా ఏడేళ్లు అవుతోంది. అయినా ఆ వ్యాఖ్యల తాలూకా ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు అనడానికి ఇప్పుడు జరుగుతున్న వ్యతిరేకత విమర్శలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరి ఈ వివాదం ప్రభావం సినిమాపై ఏ విధంగా చూపుతుందో చూడాలి. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు. మరి బాయ్‌కాట్ ‘లాల్ సింగ్ చద్దా’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Never forget never forgive. Let him REALLY feel the ‘despondency’ after his trashy remake tanks. #BoycottLaalSinghChaddha pic.twitter.com/neoZqxT4sR
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) August 2, 2022
“Please don’t boycott my film”: Aamir Khan on ‘Laal Singh Chaddha’
Read @ANI Story | https://t.co/92gN56E0JQ#AamirKhan #LaalSinghChaddha #BoycottLaalSinghChaddha pic.twitter.com/LrxmKWByTY
— ANI Digital (@ani_digital) August 1, 2022