విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదం గురించి అందరికీ తెలిసిందే. విశ్వక్ సారీచెప్పడం, దేవి మంత్రికి ఫిర్యాదు చేయడం చూశాం. దేవికి జర్నలిస్టులు, మహిళా సంఘాల సపోర్ట్ ఇస్తున్నాయి. విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో కావాల్సినంత సపోర్ట్ లభించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే.. విశ్వక్ సేన్ యాంకర్ దేవీ నాగవల్లికి థ్యాంక్స్ చెప్పాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అదేంటి సారీ చెప్పాలనో, తప్పైందని ఒప్పుకోవాలనో అడగాలి గానీ, వివాదం జరిగిన తర్వాత థ్యాంక్స్ చెప్పమంటున్నారు అనుకుంటున్నారా?
ఇదీ చదవండి: సినిమా హిట్ తో రెచ్చిపోయిన విశ్వక్ సేన్! మాస్ స్టెప్పులతో రచ్చ!
విషయం ఏంటంటే.. తన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రాంక్ చేయడంతో అది న్యూసెన్స్ అంటూ డిబేట్ పెట్టారు. నా గురించి మాట్లాడుతూ నేను లేకపోతే ఎలా అంటూ విశ్వక్ కూడా లైవ్ డిబేట్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఇద్దరూ సహనం కోల్పోయి మాట్లాడుకోవడంతో పెద్ద రచ్చ జరిగింది. ఆ హీట్ లోనే విశ్వక్ సినిమా రిలీజ్ కావడం, మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడం కూడా చూశాం. అయితే ఇక్కడ యాంకర్ దేవీ నాగవల్లి- విశ్వక్ ఇష్యూ వల్ల సినిమాకి దక్కాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ రావడం, విశ్వక్ పై సింపథీతో సినిమా చూడాలి అని అనుకోని వారు కూడా థియేటర్లకు వెళ్లడం జరిగిందని టాక్ వినిపిస్తోంది.
పెళ్లి, పెళ్లి కాని ప్రసాదులు పడే కష్టాలు, పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథలు టాలీవుడ్ లో లెక్కలేనన్ని వచ్చాయి, ఉన్నాయి, వస్తాయి కూడా. అదే కాన్సెప్ట్ విశ్వక్ కూడా ఎంచుకున్నాడు. సాధారణంగా అయితే ఇలాంటి కథల కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ మాత్రమే కోరుకుంటారు. నార్మల్ ఆడియన్స్ మౌత్ టాక్ ని బట్టే థియేటర్ కు వెళ్తారు. కానీ, విశ్వక్ పై పెరిగిన సింపథీ, సోషల్ మీడియాలో వచ్చిన టాక్ వల్ల సాధారణ ప్రేక్షకులు సైతం సినిమాకి వెళ్లడం, అర్జున్ కుమార్ అల్లంకి కనెక్ట్ అవ్వడం జరిగింది. అందుకే తన సినిమా హిట్ కావడానికి కృషి చేసిన యాంకర్ దేవీ నాగవల్లికి విశ్వక్ సేన్ థ్యాంక్స్ చెప్పాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే విశ్వక్ సినిమా హిట్ అవ్వడానికి దేవీ నాగవల్లి కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.