బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ విశ్వక్ సేన్ ని టార్గెట్ చేశారా? విశ్వక్ సేన్ ని ఇరికించే ప్రయత్నం చేశారా?
బాహుబలి నిర్మాత ‘శోభు యార్లగడ్డ‘ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ యంగ్ హీరోని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ముందుగా శోభు.. “ఒక యంగ్ హీరో తన ఆటిట్యూటడ్ వల్ల మంచి సినిమాను వదిలేసుకున్నాడు” అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అవ్వడం. అది నెటిజన్స్ మరోలా అర్ధం చేసుకుని హీరో విశ్వక్ ని టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. దాంతో ఆ పోస్ట్‌ను వెంటనే ట్విట్టర్ నుంచి తొలగించారు శోభు. ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరు? అసలు శోభు ట్వీట్ కి సంబంధం లేని విశ్వక్ ఈ విషయంలో ఎందుకు టార్గెట్ అయ్యాడు అన్న పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
“ఈ మధ్య కాలంలో సూపర్ సక్సెస్‌లో ఉన్న ఓ యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల ఒక మంచి మూవీని వదిలేసుకున్నాడు. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు ఆ సక్సెస్‌ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే పరిశ్రమలో మనకు విలువ ఉంటుంది. ఒక చిన్న డైరెక్టర్ నీకు కథ చేప్పడానికి వస్తే టైమ్ లేదని చెప్పడం పద్దతి కాదు. ఇక మీదటైనా తన తప్పు తెలుసుకుంటాడని నేను ఆశిస్తున్నా” అంటూ బాహుబలి నిర్మాత ట్వీట్ చేశారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో గందరగోళంలో పడిపోయారు నెటిజన్లు. ఇక ‘బేబి’ సినిమా దర్శకుడు ‘సాయి రాజేష్’ మొదట ఆ కథను ముందుగా విశ్వక్ సేన్ కు చెప్పడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. కానీ.. విశ్వక్ మాత్రం కథ కూడా వినకుండానే ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు.
ఇదే విషయంలో ఆ హీరో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ చేయడం నాకు కుదరనప్పుడు కథ వినాల్సిన అవసరం ఏముంది? ఆ కారణంగా ముందే నో చెప్పేశా అన్నది విశ్వక్ వాదన. దీంతో.. ఈ కాంట్రవర్సీకి కాస్త బ్రేక్ పడినట్టు అయ్యింది. కానీ, శోభు పోస్ట్ చూశాక ఆ ప్రాజెక్ట్ బేబి అని, దాన్ని వదులుకున్న హీరో విశ్వక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో.. తన పోస్ట్ విశ్వక్ సేన్ గురించి కాదని క్లారీటి ఇచ్చారు శోభు యార్లగడ్డ. తాను ముందుగా చేసిన ట్వీట్ కూడా ఆయన డిలీట్ చేశారు. ఇప్పటికైతే ఈ వివాదం కాస్త సద్దుమణిగినా.. శోభు యార్లగడ్డ ఎవరిని ఉద్దేశించి.. ఈ ట్వీట్ చేసుంటారన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.