విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి మధ్య రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఘటన జరిగిన రోజే విశ్వక్ సేన్ సారీ చెప్పడంతో అంతా ముగిసిపోతుందిలే అనుకున్నారు. కానీ, తర్వాతి రోజు మంత్రి తలసానికి ఫిర్యాదు చేయడంతో గొడవ ఇప్పుడే మొదలైందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత దేవీ నాగవల్లి మీడియా, మహిళా సంఘాల మద్దతు లభించడం చూశాం. మొదట్లో విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ, ఇప్పుడు నటులు, డైరెక్టర్లు విశ్వక్ కోసం ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై విశ్వక్ స్పందించాడు.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్ కోసం కదిలిన సినీ ఇండస్ట్రీ! స్టార్ హీరోలు వరుస ట్వీట్స్!
ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు విశ్వక్ సేన్ కౌటంర్ ఇచ్చాడు. ‘దానం నాగేందర్ కూడా ఏదో మాట్లాడారు. అవన్నీ ఆశీస్సులుగానే భావిస్తాను. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో. ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నన్ను ఎంత కించపరచాలని చూసినా ప్రజలు మాత్రం నావైపే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలు చూశారు. నిజం ఏంటనేది వాళ్లకు తెలుసు. కాబట్టే నాకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. నేను ఆ పదం తప్పే.. అది బాధలో వచ్చిందే తప్ప మరే ఉద్దేశంతో కాదు. అనుకోకుండా షాక్ లో ఆ పదం వాడేశాను. నేను ఆమెను తిట్టలేదు.
ఈ ఘటనతో నాకు జనంలో ఏ స్థానం ఉందో అర్థమైంది. వారి బ్లెస్సింగ్స్ నాకు ఏ స్థాయిలో ఉన్నాయో చూశాను. ఘటన జరిగిన తర్వాత నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఎంతో ఎమేషనల్ మూమెంట్. నేను ఇంకా ఇలా నిలబడ్డానంటే అది కేవలం నాకు ప్రజలు ఇస్తున్న మద్దతు వల్లే.. ఇచ్చి పడేస్తా.. తగ్గేదేలే’ అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. అయితే అసలు దానం నాగేందర్ ఏం అన్నారంటే.. ‘విశ్వక్ సేన్ ని హీరోగా గుర్తించడం లేదు. దేవీ నాగవల్లిని ఉద్దేశించి అభ్యంతరకర భాష వాడటం ఆమెదయోగ్యం కాదు. మీడియా అడిగినప్పుడు అయితే సమాధానం చెప్పాలి లేదా ఊరుకోవాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. అసలు స్డూడియోలోనే దేవీ చెప్పుతో కొట్టాల్సింది’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.