Birth Of Vennela: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విరాటపర్వం’. తాజాగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ దగ్గరపడటంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీకూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ అనే స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
నాలుగు నిమిషాల వీడియోలో సాయిపల్లవి పుట్టుకను చూపించారు. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక వీడియోలో ‘ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా ట్రాక్టర్‌లో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుంటారు. మార్గమధ్యంలో ఓ వైపు పోలీసులు, మరోవైపు నక్సలైట్లు కాల్పులు జరుపుతుంటారు. నొప్పులతో భాదపడుతున్న ఆ మహిళను చూసి లేడీ నక్సలైట్ వచ్చి బిడ్డకు పురుడు పోస్తుంది. ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని ‘వెన్నెల’ అని పేరు పెడుతుంది. అనంతరం తలకు బుల్లెట్ తగిలి అక్కికక్కడే చనిపోతుంది. ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణాలను పోసింది. నేను వెన్నెల ఇది నా కథ’ అంటూ సాయి పల్లవి డైలాగ్ తో వీడియో ముగుస్తుంది.
ఈ నాలుగు నిమిషాల వీడియోలో ప్రతీ ఫ్రేమ్, ప్రతి షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఎమోషనల్ చేస్తుంది. రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటించగా, సాయి పాల్లవి వెన్నెల పాత్రలో నటించింది. అయితే.. ఈ సినిమాలో సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర.. నిజజీవితంలో తూము సరళ అనే విప్లవకారిణిదే అని తెలుస్తుంది. తన ప్రేమ కోసం చేసే ప్రయాణంలో ఇన్ఫార్మర్ అనే నెపంతో తూము సరళను నక్సలైట్లు దారుణంగా హింసించి, చంపి, దహనం చేశారు.
వెన్నెలకు పుట్టుకనిచ్చిన నక్సలైట్లే.. చివరికి వెన్నెలను దారుణంగా చంపి దహనం చేసినట్లు సమాచారం. అయితే.. ఈ విరాట పర్వం సినిమా ప్రధానంగా వెన్నెల అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి, మేకర్స్ ఈ ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ వీడియో ద్వారా వెన్నెల పుట్టుకతో పాటు సినిమా కథను ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారా? అని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. యువదర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను తెరకెక్కించాడు. సుధాకర్ చెరుకూరి, డి. సురేష్ బాబు సంయక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి ఇన్ఫార్మర్ అనే నెపంతో విప్లవకారిణి తూము సరళ(సినిమాలో వెన్నెల)ను నక్సలైట్లు దారుణంగా హింసించి, చంపి, దహనం చేసిన సన్నివేశాలను దర్శకుడు నిజాయితీగా చూపించి ఉంటాడా? లేదా అనేది తెరపై చూడాలి. ఇక విరాటపర్వం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.