స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేశాడు. ప్రస్తుతం లైగర్ సినిమాతో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్లో హైప్ పెంచాయి. ఆగస్టు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా లైగర్ హీరో, హీరోయిన్లు.. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే.. కాఫీ విత్ కరణ్ షోకి హాజరయ్యాడు. ఇప్పటికే కరణ్, విజయ్‌ని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి ప్రశ్నిలు సంధించాడో.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించాడు. కరణ్ అడిగిన ప్రశ్నలకు విజయ్ కూడా అదే రేంజ్లో సమాధానం ఇచ్చాడు. ఇక షోలో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా రౌడీ హీరో లవ్ లైఫ్ గురించి కరణ్ ప్రశ్నలు సంధించాడు. అందుకు విజయ్ చెప్పిన ఆన్సర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
షోలో భాగంగా కరణ్, విజయ్‌ని ఉద్దేశించి.. ఎవరినైనా ప్రేమించావా.. ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా అని ప్రశ్నిస్తాడు. అందుకు విజయ్ బదులిస్తూ.. ‘‘నేను పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న రోజు దీనికి సమాధానం గట్టిగా చెప్తాను. అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనోభావాలను కించపరచాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది నటుడిగా నన్ను ప్రేమిస్తారు. గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు. ఫోన్ వాల్‌పేపర్ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. నన్ను అంతలా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అలాంటిది నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను’ అని బదులిచ్చాడు.
కాగా విజయ్, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! అటు రౌడీ హీరో, ఇటు రష్మిక ఇద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్యలో ఏదీలేదని స్పష్టం చేసినప్పటికీ కొందరు మాత్రం ఇప్పటికీ వారు ప్రేమికులేనని బలంగా నమ్ముతుండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు చూస్తే.. రౌడీ హీరో ఎవరితోనే డీప్ లవ్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది అంటున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.