రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లైగర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. జులై 21న లైగర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్ లో లైగర్ ట్రైలర్ కంటే దాని రిలీజ్ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో వారసత్వంపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు దానికి ఆర్జం పోసినట్లు అయ్యింది. విషయం ఏంటంటే.. లైగర్ ట్రైలర్ రిలీజ్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అక్కడికి వచ్చిన తన అభిమానులను చూస్తూ.. “అంటే మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడు తెల్వదు. రెండేళ్లు అవుతోంది సినిమా రిలీజ్ అయ్యి. అంతకు ముందు రిలీజ్ అయిన సినిమా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా?” అంటూ విజయ్ కామెంట్ చేశాడు. India, We give you Blood, Sweat, Madness. We give you Mass Action Entertainment. We give you The LIGER Trailer! ATTACK!https://t.co/u7529aF8NS#LIGER#LigerTrailer Aug 25th Worldwide Release! pic.twitter.com/f6kFdVvCPS — Vijay Deverakonda (@TheDeverakonda) July 21, 2022 విజయ్ దేవరకొండ కావాలనే వారసత్వం అనే అంశంపై కామెంట్ చేశాడంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండకు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. విజయ్ వ్యాఖ్యల విషయంలో బండ్ల గణేశ్ సీరియస్ గానే రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది. టాలెంట్ కూడా ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh — BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022 బండ్ల గణేశ్ ఏమన్నాడంటే.. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్ లా, మహేశ్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్” బండ్లన్న ట్వీట్ చేశాడు. ఎక్కడా విజయ్ దేవరకొండ పేరు గానీ, అతడిని ట్యాగ్ గానీ చేయలేదు. కానీ, ఆ ట్వీట్ కు రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబులను ట్యాగ్ చేయడం విశేషం. బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: నాలుగో భర్తతో హనీమూన్ లో స్టార్ సింగర్.. ఫోటోలు వైరల్! ఇదీ చదవండి: నాగచైతన్యతో విడిపోవడంపై ఓపెన్ అయిన సమంత