సమంత.. ప్రస్తుతం యాడ్స్, సాంగ్స్, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ లోనూ అక్షయ్ కుమార్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తో కలిసి సమంత కాఫీ విత్ కరణ్ షోకి హాజరైంది. ఆ ఎపిసోడ్ లో అక్షయ్- సమంత చేసిన అల్లరి ప్రస్తుతం ఓటీటీలో వైరల్ గా మారింది. అంతేకాకుండా సమంత చెప్పిన సమాధానాలు, ప్రస్తావించిన టాపిక్స్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా కూడా మారాయి. కరణ్ జోహార్ ఫన్నీ ప్రశ్నలతో పాటుగా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగేశాడు వాటిలో సమంత దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే సమంత అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపెన్ గానే సమాధానం చెప్పింది. ఇదీ చదవండి: మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు లేకుండా చూడాలి: సమంత తమ మధ్య విడిపోవడం అంత సామరస్యంగా సాగలేదంటూ ప్రస్తావించింది. అంతేకాకుడా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తన జీవితం ఎంతో కష్టంగా మారిందంటూ చెప్పుకొచ్చింది. విడిపోయాక ఒకరిపై ఒకరు తీవ్ర మనోవేదనకు గురైనట్లు అంగీకరించింది. ప్రస్తుతం మాత్రం తాను చాలా ధైర్యంగా ఉన్నట్లు.. తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లు తెలిపింది. ఇంక సినిమాల విషయానికి వస్తే.. శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ‘యశోద’ ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇంక రౌడీ హీరోతో కలిసి ఖుషీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. నాగ చైతన్యతో విడిపోవడంపై సమంత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: 68వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన! ఇదీ చదవండి: మహేశ్ బాబు ఫ్యాన్ గా నాగచైతన్య! వైరల్ అవుతున్న బ్యానర్!