ఈ మధ్యకాలంలో ప్రేమ, పెళ్లి విషయాలలో పాశ్చాత్య సంస్కృతులను ఫాలో అవుతున్నారు ఇండియన్ సెలబ్రిటీలు. జీవితంలో ప్రేమ, పెళ్లిని ఎంతో అపురూపంగా భావిస్తుంటారు. కానీ.. విదేశీ సంస్కృతిలో ప్రేమ, పెళ్లి అనే పదాలకు విలువ ఉందా లేదా అనేది పక్కనపెడితే.. అక్కడి సెలబ్రిటీల ప్రేమ, పెళ్లిళ్లు ఒక్కరితో మాత్రం ఆగవనే చెప్పాలి. కనీసం కలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. పైగా వెంటనే మరో బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ అంటూ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంటారు. ఇక లైఫ్ లో మూడు పెళ్లిళ్లే ఎక్కువ అనుకుంటే ఇటీవలే నాలుగో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ పాపులర్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్.. తాజాగా భర్తతో హనీమూన్ కి వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏంటి.. నాలుగో పెళ్లి.. పైగా హనీమూనా? అని ఆశ్చర్యపోకండి. విడిపోవడానికి భర్త, చేసుకోవడానికి వేరొకరు సిద్ధంగా ఉంటే గనక.. ఇలాంటి హనీమూన్స్ ఫ్యూచర్ లో మరెన్నో వినిపిస్తాయి. ఇంతకీ లోపెజ్ ని పెళ్లాడిన ఆ వ్యక్తి ఎవరంటే.. హాలీవుడ్ సినీ నటుడు బెన్ అఫ్లెక్. ఏప్రిల్‌లో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన మూడు నెలల తర్వాత జూలై 16న లాస్ వెగాస్‌లోని లిటిల్ వైట్ వెడ్డింగ్ చాపెల్‌లో బెన్ మరియు జెన్నిఫర్ వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ నవదంపతులు హనీమూన్ కోసం పారిస్‌ని ఎంచుకున్నారు. ఫ్రెంచ్ రాజధానిలో జెన్నిఫర్, బెన్ రెస్టారెంట్‌లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక హనీమూన్ లో భాగంగా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరి జెన్నిఫర్ లోపెజ్ లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Jennifer Lopez ♡ (@jlopezaesthetic)