లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకర్ కొమాకుల. ప్రస్తుతం ఆయన తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఆయన నటించిన తాజా చిత్రం..
ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ఎంతో మంది నటీ,నటులకు లైఫ్ ఇచ్చింది. నాడు సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేసి నేడు హీరోలుగా వెలుగొందుతున్న వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, సుధాకర్ కొమాకుల ఈ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, సుధాకర్ కొమాకుల 2002లోనే సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఓ రెండు సినిమాల్లో నటించిన తర్వాత అమెరికా వెళ్లిపోయారు.
అక్కడినుంచే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ అవకాశం రావటంతో ఇండియాకు వచ్చారు. ఇక, అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. సుధాకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ నారాయణ అండ్ కో’ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండకు చేసిన సాయంపై స్పందించారు. సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘ నేను విజయ్‌కి ఫుడ్ పెట్టిన క్యాండిడేట్ అని మీడియా రాసుకుంది.
యూట్యూబ్ లింక్స్ చూడకండి. మొత్తం చదవండి. మీరు కాలేజీలో చదువుకుంటున్నపుడు.. మీరు మీ ఫ్రెండ్‌కు సహాయం చేస్తే.. మీ ఫ్రెండ్ మీకు ఏదో ఒక సాయం చేస్తాడుగా. మీ ఫ్రెండ్ టాప్‌లోకి వెళ్లాడు. ఆయన చేసింది గుర్తు ఉండదు. మనం చేసింది పెద్ద ఇదిగా ఉంటుంది. అదేమీ పట్టించుకోకూడదు. ఇట్స్ కామన్. ఇండస్ట్రీలో గివ్ అండ్ టేక్. దాన్ని పెద్దగా చేసి.. నేను అది చేశాను.. ఇది చేశాను అని చెప్పుకోకూడదు. అది కామన్. తను కూడా నాకు చాలా ఇన్‌ఫర్‌మేషన్ ఇచ్చాడు. ఇదంతా గివ్ అండ్ టేక్’’ అని అన్నారు.