విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వెంకీ నెట్ ఫ్లిక్స్ కి గన్ పట్టుకొని మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో ఓటిటి వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిపోయేసరికి చిన్న హీరోల నుండి స్టార్స్ వరకు వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫ్యాన్స్ కూడా స్టార్స్ ని ఓటిటి సిరీస్ లలో చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. సినిమాలంటే బిగ్ స్క్రీన్ పై చూసేందుకు థియేటర్స్ కి వెళ్ళాలి. అదే ఓటిటి సినిమాలు/సిరీస్ లైతే ఎంచక్కా ఎక్కడివారక్కడే.. ఇంట్లో కూర్చొని ఫ్యామిలీస్ తో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటికే చాలామంది తెలుగు స్టార్స్ ఓటిటి సినిమాలు, సిరీస్ లలో ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు ఇదే బాటలో స్టార్స్ విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు.
ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్న ఈ రానా నాయుడు సిరీస్.. అమెరికన్ డ్రామా సిరీస్ ‘రే డొనవన్’కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సిరీస్ లో వెంకటేష్, రానాలతో పాటు సుర్వీన్ చావ్లా, సుచిత్ర పిళ్ళై తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. కాగా.. మొదటిసారి వెంకీ, రానా ఒకే సిరీస్ లో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ కోసం ఆల్రెడీ దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ కి సంబంధించి ప్రమోషన్స్ మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రానా నాయుడుని జనాల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా వెంకీ నెట్ ఫ్లిక్స్ కి గన్ పట్టుకొని మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్ ఫ్లిక్స్.. రానా నాయుడులో హీరో నేను. స్టార్ కూడా నేనే. అందరికంటే అందంగా కనిపించేది నేనే. ఫ్యాన్స్ నా వాళ్లే. అలాంటప్పుడు సిరీస్ కి ఎవరి పేరుండాలి. నా పేరు.. నాగా నాయుడు. నాతో ఇలాంటి మజాకులు చేస్తే.. నేను అబ్దుల్ రజాక్ లా మారాల్సి ఉంటుంది’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోని నెట్ ఫ్లిక్స్ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కూడా ట్విట్టర్ లో రీట్వీట్ చేయడంలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ రానా నాయుడు సిరీస్ లో వెంకటేష్ లుక్ కొత్తగా ఉంది. మరి సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. మరి రానా నాయుడు సిరీస్ పై మీ అభిప్రాయాలు, అంచనాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023