గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపగా.. షారుక్ ఖాన్ సంతాపం తెలిపిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లతాజీ పార్థీవ దేహానికి నివాళులర్పించే క్రమంలో షారుక్ ఖాన్ ప్రార్థనలు చేశారు. అనంతరం మాస్క్ తీసి.. ఊదారు. అయితే కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. షారుక్ ఖాన్ లతాజీ మృతదేహం వద్ద ఉమ్మేశారని ఆరోపించారు. అంతటితో ఆగక షారుక్ ని దారుణంగా ట్రోల్ చేశారు. అటు బాద్ షా అభిమానులు షారుక్ తన మతాచారం ప్రకారం నివాళులర్పించారని.. ఆయన ఉమ్మలేదు.. ఊదారని విమర్శించే వారికి కౌంటర్లు ఇవ్వసాగారు. మొత్తానికి సరిగా పరిశీలించకుండానే షారుక్ ని దారుణంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి : కంట తడి పెట్టిస్తున్న లతా మంగేష్కర్ వీడియో
ఈ క్రమంలో ఈ వివాదంపై సీనియర్ నటి.. ఒకప్పటి హీరోయిన్ ఊర్మిళ మాటోండ్కర్ స్పందించారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ ని విమర్శించే వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రార్థనను కూడా ఉమ్మేయడం అనుకునే సమాజంలో బతుకుతున్నామంటూ అసహనం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ ఫార్మ ట్ లో నిలబెట్టిన షారుక్ పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం తనను ఎంతో బాధించింది అని తెలిపారు. ఊర్మిళ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shah Rukh Khan paying his respects at the last rites of #LataMangeshkar Ji 🙏 pic.twitter.com/b0gAt8ztDQ
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 6, 2022
ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంత.. ఇప్పుడవి ఎవరికి చెందుతాయి..?