Upcoming Movies: లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. పాన్ ఇండియా సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకూ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. గత నెలలో పదికి పైగా తెలుగు సినిమాలు నేరుగా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ప్రతి నెలా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన తెలుగు సినిమాలు.. పెద్దగా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయాయి. కానీ.. వేరే భాషల నుండి డబ్బింగ్ రూపంలో వచ్చిన సినిమాలు మాత్రం కలెక్షన్స్ దుమ్మురేపాయని చెప్పవచ్చు. ఇక జూలైలో కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు దాదాపు 11 తెలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. మరి వాటిలో బాక్సాఫీస్ వద్ద నిలబడేవి ఏవో.. కిందపడేవి ఏవో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఇక వచ్చేనెల(జూలై) మొదటిరోజు నుండే సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. మరి జూలై నెలలో రిలీజ్ అవుతున్న చిన్నాపెద్దా తెలుగు సినిమాలేవో లిస్ట్ చూద్దాం!
జూలై 1 – పక్కా కమర్షియల్
జూలై 1 – టెన్త్ క్లాస్ డైరీస్
జూలై 1 – రాకెట్రీ
జూలై 14 – ది వారియర్
జూలై 15 – హ్యాపీ బర్త్ డే
జూలై 15 – గుర్తుందా శీతాకాలం
జూలై 22 – థ్యాంక్ యూ
జూలై 22 – కార్తికేయ 2
జూలై 22 – శంషేరా
జూలై 28 – విక్రాంత్ రోణ
జూలై 29 – రామారావు ఆన్ డ్యూటీ
ప్రస్తుతానికి ఈ సినిమాలు జూలై నెలలో థియేట్రికల్ రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ టైంకి ఇంకా వేరే సినిమాలు ఈ లిస్టులో చేరవచ్చు లేదా ఇందులో ఏవైనా డ్రాప్ అవ్వచ్చు. అయితే.. జూలైలోనే మరిన్ని డబ్బింగ్ సినిమాలు సైతం స్ట్రయిట్ తెలుగు సినిమాలకు పోటీగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి పైన తెలిపిన అప్ కమింగ్ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.
Movies In Telugu – July’22 Releases pic.twitter.com/iWu16uSMsw
— Aakashavaani (@TheAakashavaani) June 24, 2022