భారతీయ సినీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ కి ఎన్నో అవార్డులు.. రివార్డులు దక్కాయి. దేశం గర్వించదగిన నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఇండస్ట్రీలో ఎవరూ చేయని ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు కమల్ హాసన్. తాజాగా కమల్ హాసన్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించడంపై ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీసా పది సంవత్సాల వరకు కొనసాగుతుంది. ఇక తనకు ఇంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడంపై కమల్ హాసన్ స్పందించారు.. ఎమిరేట్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు తనకు గోల్డెన్ వీసా అందిస్తున్నప్పటి ఫొటోలను కూడా కమల్ పంచుకున్నారు. దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్ కు కమల్ ధన్యవాదాలు తెలిపారు.
ఇక కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు పదేళ్ళ తర్వాత లభించిన సూపర్ హిట్ తో కమల్ ఎంతో సంతోషంలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thanks to Dubai Film and TV Commission for supporting talents and creative people. (2/2)@FilmDubai @GDRFADUBAI #Dubai #filmDubai #goldenvisa
— Kamal Haasan (@ikamalhaasan) July 21, 2022
ఇది చదవండి: Meena: తొలిసారి కెమెరా ముందుకు మీనా! ఆలీ భార్యతో కలిసి వీడియో!